By: Khagesh | Updated at : 19 Nov 2025 04:02 PM (IST)
కొత్త ఆధార్ యాప్‌లో విప్లవాత్మక మార్పులు ( Image Source : Other )
Aadhaar App: యూఐడీఏఐ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఈ యాప్ భద్రతతోపాటు మీ కుటుంబానికి సంబంధించిన ఆధార్‌లను కూడా అందులో క్యారీ చేయవచ్చు. ఆఫ్‌లైన్ యాక్సెస్‌తో సహా అనేక కీలక అప్‌గ్రేడ్‌లను తీసుకువచ్చింది. ఇది దేశంలోని దాదాపు 140 కోట్ల మంది ఆధార్ వినియోగదారుల డిజిటల్ గుర్తింపు నిర్వహణను సరళతరం చేస్తుంది.
భారతదేశంలో డిజిటల్ గుర్తింపు అనగానే మొదట గుర్తుకు వచ్చేది 'ఆధార్'. అయితే, ఆధార్ సేవలు, నిర్వహణ కొంత సంక్లిష్టంగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఎమ్‌ఆధార్ ఉన్నప్పటికీ అది అంద ప్రయోజనకరంగా ఉండటం లేదు. అందులో ఒక వ్యక్తి ఆధార్ మాత్రమే కనిపిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పౌరుల కోసం సరికొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. ఈ కొత్త అప్లికేషన్ 2017లో విడుదలైన పాత 'mAadhaar' యాప్ కంటే భిన్నంగా ఉంటుంది. అప్‌డేట్ చేసిన భద్రతా ప్రమాణాలు, మల్టీ-ప్రొఫైల్ సపోర్ట్, ఆఫ్‌లైన్ యాక్సెస్, డేటాపై సులభమైన నియంత్రణ వంటి మెరుగైన ఫీచర్లను ఈ కొత్త యాప్ పరిచయం చేసింది.
దాదాపు 140 కోట్ల మంది ఆధార్ కార్డు హోల్డర్లకు డిజిటల్ గుర్తింపు నిర్వహణను మరింత సరళంగా, సురక్షితంగా మార్చడమే ఈ కొత్త అప్లికేషన్ ప్రధాన లక్ష్యం. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు Google Play Store, Apple App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గతంలో mAadhaar యాప్ ద్వారా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను నిర్వహించడం కష్టంగా ఉండేది, ఎందుకంటే పాత యాప్‌లో ఈ ఆప్షన్ లేదు. పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి, వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించాల్సి వచ్చేది. ఈ కొత్త అప్లికేషన్‌లో వీటన్నింటికీ పరిష్కారం చూపించారు. ప్రజలు తమ ఆధార్‌ను తమ వెంట తీసుకెళ్లాల్సిన పని లేదు. వెంటనే ధృవీకరించేందుకు కూడా వీలు కల్పిస్తుంది. బ్యాంకింగ్, అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, పాస్‌పోర్ట్‌లు వంటి ప్రక్రియ మరింత సులభతరం చేస్తాయి.
యూఐడీఏఐ ఈ యాప్‌ను ఎర్లీ యాక్సెస్ రూపంలో విడుదల చేసింది, దీని ద్వారా వినియోగదారులు ఫీచర్లు పరీక్షించి, తుది విడుదలకి ముందు ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. ఈ కొత్త యాప్‌లో డేటా నియంత్రణ పూర్తిగా వినియోగదారుల చేతుల్లో ఉంచుతుంది.
ఇది కొత్త యాప్ అందించే అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి. వినియోగదారులు ఇప్పుడు ఐదుగురు కుటుంబ సభ్యుల వరకు ఆధార్ కార్డులను ఒకే యాప్‌లో యాడ్ చేయవచ్చ. అయితే, ఈ కుటుంబ సభ్యులందరూ సాధారణ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను షేర్ చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ ప్రొఫైల్‌లను తమ మొబైల్ నంబర్‌పై సులభంగా నిర్వహించడానికి ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తంది.
భద్రత విషయంలో ఈ యాప్ ఒక ముందడుగు వేసింది. కొత్తగా చేర్చిన బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ డేటాను లాక్ చేయవచ్చు. ఒకసారి లాక్ అయిన తర్వాత, వారు స్వయంగా అన్‌లాక్ చేస్తే తప్ప, వారి సమాచారాన్ని ఎవరూ యాక్సెస్ చేయలేరు లేదా పంచుకోలేరు. యాప్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి వారి ముఖాన్ని లేదా వేలిముద్రను ఉపయోగించవచ్చు.
లాక్ చేసిన బయోమెట్రిక్ డేటా, వినియోగదారు ఉద్దేశపూర్వకంగా అన్‌లాక్ చేసే వరకు లేదా నిలిపివేసే వరకు సురక్షితంగా ఉంటుంది.
పాత విధానంలో, ధృవీకరణ సమయంలో పూర్తి ఆధార్ వివరాలు అందరికీ తెలిసిపోయేవి. కానీ ఈ కొత్త యాప్ వినియోగదారులు ఏ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నారో నిర్ణయించే స్వేచ్ఛను ఇస్తుంది. ఉదాహరణకు, వారు తమ పేరు, ఫోటోను మాత్రమే డిస్‌ప్లే చేయడానికి ఎంచుకోవచ్చు, అయితే చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వివరాలను గోప్యంగా ఉంచవచ్చు.
ముఖ్యంగా, ఆధార్ వివరాలను డిజిటల్‌గా షేర్ చేసేటప్పుడు, డేటా మాస్క్ చేస్తారు. అంటే, వినియోగదారులు పూర్తి 12-అంకెల సంఖ్యను వెల్లడించాల్సిన అవసరం లేదు, తద్వారా గోప్యత పెరుగుతుంది.
భద్రత, పారదర్శకత కోసం మరో అదనపు లేయర్‌ను కూడా యాడ్ చేసింది. ఈ యాప్‌లో యూజర్ లాగ్ ఉంటుంది. ఆధార్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించారో అనే వివరాలను చెబుతుంది. తద్వారా వినియోగదారులకు తమ డేటా వినియోగంపై పూర్తి నియంత్రణ లభిస్తుంది.
ఈ అప్‌డేటెడ్ యాప్ ప్రాక్టికల్ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించారు.
క్యూఆర్ కోడ్ ఫంక్షనాలిటీ : బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు ,సేవా కేంద్రాల్లో ఎటువంటి కాగితం అవసరం లేకుండా తక్షణ ధృవీకరణ కోసం యాప్ ద్వారా ఆధార్ క్యూఆర్ కోడ్‌లను రూపొందించవచ్చు ,స్కాన్ చేయవచ్చు. ఆధార్ వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా లేదా ధృవీకరించదగిన ఆధారాలుగా పంచుకోవచ్చు.
ఆఫ్‌లైన్ యాక్సెస్: ఈ యాప్ అద్భుతమైన ఫీచర్లలో ఇది ఒకటి. ప్రారంభ సెటప్ పూర్తైన తర్వాత, వినియోగదారులు స్టోర్ చేసిన ఆధార్ వివరాలను ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే చూడవచ్చు. అయినప్పటికీ, పూర్తి స్థాయి టూల్స్ సేవలను పొందడానికి ఆన్‌లైన్ మోడ్ అవసరం.
కొత్త ఆధార్ యాప్‌ను వినియోగించడం చాలా సులభం, యూఐడీఏఐ దీనిని దశలవారీగా వివరించింది:
1. డౌన్‌లోడ్: Google Play Store లేదా iOS యాప్ స్టోర్ నుంచి 'ఆధార్ యాప్'ను డౌన్‌లోడ్ చేయండి.
2. ఆధార్ నంబర్: డౌన్‌లోడ్ చేసి, మొదటిసారి క్లిక్ చేసినప్పుడు, వినియోగదారు తమ 12-అంకెల ఆధార్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది.
3. మొబైల్ నంబర్ ధృవీకరణ: రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దాని ద్వారా ధృవీకరించాలి.
4. బయోమెట్రిక్ ధృవీకరణ: వినియోగదారు అప్పుడు వారి ముఖాన్ని ఉపయోగించి ధృవీకరించమని అడుగుతుంది. స్క్రీన్‌పై ఉన్న కెమెరా సర్కిల్‌లో మీ ముఖాన్ని ఉంచి, ధృవీకరణ పూర్తయ్యే వరకు కనురెప్పలు ఆర్పాలి. దీంతో ఈ ధృవీకరణ పూర్తవుతుంది.
5. ప్రొఫైల్ జోడింపు & పిన్ సృష్టి: ధృవీకరణ పూర్తయిన తర్వాత, వినియోగదారు యాప్ హోమ్ పేజీకి వెళ్లి, ఆధార్ ప్రొఫైల్‌ను యాడ్ చేయమని అడుగుతారు. ప్రొఫైల్‌ను భద్రపరచడానికి ఆరు అంకెల భద్రతా పిన్‌ను క్రియేట్ చేయాలి.
సెటప్ పూర్తయిన తర్వాత, వినియోగదారులు తమ వివరాలను చూడవచ్చు, క్యూఆర్ కోడ్‌ను పొందవచ్చు, ధృవీకరించదగిన ఆధారాలను పంచుకోవచ్చు, బయోమెట్రిక్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు.
మీరు హోమ్ పేజీకి వచ్చిన తర్వాత, యాప్ ఫీచర్ల గురించి ఆటోమేటిక్‌గా గైడ్ చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే గైడ్‌ను దాటవేయవచ్చు, కానీ అనుసరించడం మంచిది.
మరొక ప్రొఫైల్‌ను జోడించడానికి:
యూఐడీఏఐ తన పౌరులకు డిజిటల్ గుర్తింపుపై పూర్తి నియంత్రణ, పోర్టబిలిటీ, గోప్యత నేరుగా వారి చేతుల్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇది భవిష్యత్తులో విస్తృత స్థాయిలో సేవలు మెరుగుపరిచేందుకు ఇప్పుడు విడుదలైన యాప్‌లో ఉన్న లోపాలను గుర్తించి, ఫీడ్‌బ్యాక్ రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని వినియోదారులకు సూచిస్తోంది.
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను సైలెంట్‌గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit: పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Gummadi Narsayya biopic: రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్ కుమార్ - షూటింగ్ ప్రారంభం