By: ABP Desam | Updated at : 08 Feb 2023 11:44 AM (IST)
Edited By: Arunmali
గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Home Loan EMI Calculator: వరుసగా ఆరోసారి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తన రెపో రేటును పెంచింది. రెపో రెటును 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు RBI పెంచింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు 0.25 శాతం రెపో రేటు పెంపునకు అనుగుణంగా ఓటు వేశారు. దీంతో, మొత్తం రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి (RBI Repo Rate) చేరింది.
మీరు సొంత ఇల్లు కొనాలన్న ప్లాన్‌లో ఉంటే, కొత్త సంవత్సరంలో హోమ్ లోన్ మరింత ఖరీదుగా మారుతుంది. అంతేకాదు, మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకుని నెలనెలా EMIలు చెల్లిస్తుంటే, ఇకపై ఆ నెలవారీ వాయిదాల మొత్తం కూడా మరింత భారంగా మారుతుంది.
RBI రెపో రేటు పెంపు ప్రభావం
ఆర్‌బీఐ రెపో రేటు పెరగడంతో, అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వరకు గృహ రుణాల వడ్డీ రేట్లను పెంచుతాయి. ఆ ప్రభావం మీ EMI మీద పడుతుంది. మీ EMI మీద ఎంత భారం పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
రూ. 25 లక్షల గృహ రుణంపై EMI ఎంత పెరుగుతుంది?
దేశంలోని అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మీకు 8.60 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాల పరిమితికి రూ. 25 లక్షల గృహ రుణం ఇచ్చిందని అనుకుందాం. దాని మీద ఇప్పుడు మీరు నెలనెలా రూ. 21,854 ఈఎంఐ చెల్లిస్తున్నారని భావిద్దాం. ఇప్పుడు, రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగిన తర్వాత, బ్యాంక్ వడ్డీ రేటు 8.85 శాతానికి పెరుగుతుంది. దాని మీద EMI రూపంలో రూ. 22,253 చెల్లించాలి. అంటే, రూ. 25 లక్షల గృహ రుణం మీద నెలనెలా మీరు అదనంగా రూ. 399 (22,253- 21,854) చెల్లించాలి.
రూ. 40 లక్షల గృహ రుణం EMI ఎంత పెరుగుతుంది?
ప్రస్తుతం, 8.60 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాల పరిమితికి, రూ. 40 లక్షల గృహ రుణం మీద EMI రూ. 34,967 గా ఉంది. ఇప్పుడు, రెపో రేటులో 0.25 శాతం పెరిగిన తర్వాత, వడ్డీని 8.85 శాతం చొప్పున చెల్లించాలి. అప్పుడు EMI మొత్తం రూ. 35,604 గా మారుతుంది. అంటే ప్రతి నెలా మీరు రూ. 637 (35,604 - 34,967) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 50 లక్షల గృహ రుణం EMI ఎంత పెరుగుతుంది?
15 సంవత్సరాలకు, రూ. 50 లక్షల గృహ రుణానికి 8.60 శాతం చొప్పున ఈఎంఐ రూ. 49,531 గా ఇప్పుడు ఉంది. రెపో రేటు 0.25 శాతం పెరిగిన తర్వాత, ఇప్పుడు మీరు రూ. 50,268 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెల మీరు రూ. 737 (50,268 - 49,531) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ALSO READ: రెపో రేటును 0.25 శాతం పెంచిన ఆర్‌బీఐ, బ్యాంక్ రుణాల మీద వడ్డీ రేట్లూ పెరుగుతాయ్
Gold-Silver Prices Today 22 Mar: రూ.90,000కు దిగొచ్చిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్
PF Loan: డబ్బు అవసరనప్పుడు ఆదుకునే PF లోన్ - దరఖాస్తు చేయడం సులభం
Income Tax Benifit: కుటుంబంతో కలిసి జాలీగా హాలిడే ట్రిప్స్ వేయండి, పన్ను మిహాయింపు పొందండి
GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ