By: ABP Desam | Updated at : 03 Oct 2023 01:12 PM (IST)
రెండు స్పెషల్ స్కీమ్స్‌ను క్లోజ్ చేసిన HDFC బ్యాంక్
HDFC Bank FD Interest Rates: మన దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ లెండర్ అయిన HDFC బ్యాంక్, రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్లను సవరించింది. ఈ బ్యాంక్, ఈ ఏడాది మే 29న 0.05% అధిక వడ్డీ రేటు బెనిఫిట్‌తో 35 నెలలు & 55 నెలల గడువుతో రెండు ప్రత్యేక ఎఫ్‌డీలను స్టార్ట్ చేసింది. ఈ నెల ప్రారంభం (అక్టోబర్ 1, 2023) నుంచి ఆ రెండు స్కీమ్‌లను నిలిపివేసింది. దీనివల్ల, ఇప్పుడు ఆ రెండు టెన్యూర్స్‌పై 0.05% తక్కువ వడ్డీని కస్టమర్లు పొందుతారు.
HDFC బ్యాంక్ FD రేట్లు
7 నుంచి 29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3% వడ్డీ రేటును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెల్లిస్తోంది. 30 - 45 రోజుల టెన్యూర్ కోసం 3.50% వడ్డీ ఆదాయాన్ని అందిస్తోంది. 46 రోజుల నుంచి 6 నెలల వరకు డిపాజిట్ కాలవ్యవధిపై 4.50%; 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కాలవ్యవధిపై 5.75% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూరిటీ గడువు ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 6.00%; 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు మెచ్యూరిటీ గడువు ఉన్న వాటికి 6.60% వడ్డీ రేటు లభిస్తుంది.
15 నెలల నుంచి 18 నెలల కాల పరిమితి FDలపై HDFC బ్యాంక్ 7.10% వడ్డీ రేటును ఇస్తోంది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల 11 నెలల వరకు టైమ్ ఉండే FDలపై 7.00% వడ్డీ రేటును చెల్లిస్తోంది. 2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు డిపాజిట్ వ్యవధిపై 7.15% వడ్డీ రేటును అందిస్తోంది. 2 సంవత్సరాల 11 నెలల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల డిపాజిట్ కాలవ్యవధిపై వడ్డీ రేటు 7%గా ఉంది. 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ 7.20%; 4 సంవత్సరాల 7 నెలల నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే వాటికి 7% వడ్డీ లభిస్తుంది.
మీ ఆర్థిక లక్ష్యాలకు తగినట్లుగా ఒక మెచ్యూరిటీ రేంజ్‌ను ఎంచుకోవచ్చు, కేవలం రూ. 5,000తో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ స్టార్ట్ చేయవచ్చు. HDFC బ్యాంక్ అందించే ఆకర్షణీయమైన FD వడ్డీ రేట్ల ప్రయోజనంతో పాటు... స్వీప్-ఇన్ ఆప్షన్స్, ఓవర్‌డ్రాఫ్ట్ ఫీచర్స్ వంటి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హామీ ఇచ్చిన రాబడిని పొందవచ్చు.
HDFC బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో వడ్డీ చెల్లింపుల కోసం మూడు ఆప్షన్స్ ఉన్నాయి: నెలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం), మెచ్యూరిటీ సమయంలో వడ్డీ చెల్లిస్తారు. చక్రవడ్డీ బెనిఫిట్ తీసుకోవాలంటే, HDFC బ్యాంక్‌లో రీ-ఇన్వెస్ట్‌మెంట్ FDని ఎంచుకోవచ్చు.
HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ FD
HDFC బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీని (HDFC Bank Senior Citizen Care FD) ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం డిజైన్ చేశారు. 7 రోజుల నుంచి 5 సంవత్సరాల కాలానికి రూ.5 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బుక్ చేసుకుంటే, సాధారణ ప్రజలకు ఇచ్చే రేట్ల కంటే 0.50% (అర శాతం) ఎక్కువ వడ్డీని పొందుతారు. 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధిపై సాధారణ రేట్ల కంటే 0.75% (ముప్పావు శాతం) అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.
ఎక్కువ వడ్డీ దక్కే టైమ్ పిరియడ్
వడ్డీ రేట్లలో రీసెంట్ రివిజన్ తర్వాత, సాధారణ ప్రజలకు 4 సంవత్సరాల 7 నెలలు - 55 నెలల కాలానికి గరిష్టంగా 7.20%; సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల 1 రోజు - 10 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కోసం గరిష్టంగా 7.75% రాబడిని HDFC బ్యాంక్ అందిస్తోంది.
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy