search
×

GST Rates: గుడ్‌న్యూస్‌! ఈ ఆహార పదార్థాలపై జీఎస్టీ లేదన్న నిర్మలా సీతారామన్‌

GST Rates: ధాన్యాలు, పప్పులు, పిండి, పెరుగు, బటర్‌ మిల్క్‌ను ప్యాక్‌ చేయకుండా విక్రయిస్తే 5 శాతం పన్ను ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

FOLLOW US: 
Share:

GST Rates: కొన్ని వస్తువులను విడిగా అమ్మినప్పుడు జీఎస్టీ వర్తించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ధాన్యాలు, పప్పులు, పిండి, పెరుగు, బటర్‌ మిల్క్‌ను ప్యాక్‌ చేయకుండా విక్రయిస్తే 5 శాతం పన్ను ఉండదని స్పష్టం చేశారు. జీఎస్‌టీ మండలిలో ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరని, అంతా కలిసి సమష్టిగా పన్ను రేట్లు నిర్ణయిస్తారని వరుస ట్వీట్లు చేశారు. కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

'ముందుగానే ప్యాక్‌ చేసిన, లేబుల్‌ వేసిన వస్తువులపై పన్ను వేయాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి సమష్టిగా తీసుకుంది. ఏ ఒక్కరో తీసుకోలేదు. ఈ జాబితాలోని వస్తువులను ప్యాక్‌ చేయకుండా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదు. మా చర్చలు ఎలా జరిగాయో, వాటి సారాంశం ఏమిటో ఈ 14 ట్వీట్లలో ఇస్తున్నాం' అని నిర్మల ట్వీట్‌ చేశారు.

'పప్పులు, ధాన్యాలు, పిండి సహా మరికొన్ని ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ మండలి 47వ సమావేశంలో నిర్ణయించింది. ప్రస్తుతం వ్యాపించిన  సమాచారంలో అవాస్తవాలు ఉన్నాయి. ఆ ఆహార పదార్థాలపై పన్ను విధించడం ఇదే తొలిసారా? కానే కాదు. జీఎస్టీకి ముందూ ఇలాంటి వస్తువులపై రాష్ట్రాలు పన్నుల ద్వారా రాబడి పొందాయి. తిండి గింజలపై కొనుగోలు పన్ను ద్వారా పంజాబ్‌ ఒక్కటే రూ.2000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ రూ.700 కోట్లు రాబట్టింది. ఆహార పదార్థాలపై పంజాబ్‌ 5.5, మహారాష్ట్ర 6, చత్తీస్‌ గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, కేరళ, మణిపుర్‌ 5 శాతం మేర పన్ను వసూలు చేశాయి' అని నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు.

'గతంలో రిజిస్టర్‌ చేసిన బ్రాండ్లపై జీఎస్టీ విధించాం. దీనిని కొందరు వ్యాపారస్తులు దుర్వినియోగం చేశారు. సవ్యంగా పన్నులు చెల్లిస్తున్నవారు అందరికీ ఒకేలా ఉండాలా మార్పులు చేయాలని కోరారు. వారి సూచనల మేరకే ప్యాకేజీ, లేబుల్‌ వేసిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధించాం. పన్ను ఎగవేతను రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల అధికారులతో కూడిన బృందం గుర్తించింది. దుర్వినియోగం చేయకుండా నిబంధనలు మార్చాలని అనేక సమావేశాల్లో చర్చించాం' అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

జీఎస్టీ వర్తించని వస్తువులు

  • ధాన్యాలు, పప్పులు
  • గోధుమలు
  • ఓట్స్‌
  • మైదా పిండి
  • బియ్యం
  • పిండి
  • రవ్వ
  • శెనగపిండి
  • పఫ్ఫుడ్‌ రైస్‌
  • పెరుగు / లస్సీ

Published at : 19 Jul 2022 06:13 PM (IST) Tags: GST Nirmala Sitharaman GST Rates GST Council Meet wheat pulses Aata

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం

ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం

Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా

Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్‌ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!

టాప్ స్టోరీస్

GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  

GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  

VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ

VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ

Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు