By: ABP Desam | Updated at : 28 May 2022 03:25 PM (IST)
బిట్‌కాయిన్ ( Image Source : Getty )
Governments Owning Crypto: బిట్‌కాయిన్..! ప్రపంచంలోని అన్ని కరెన్సీలను వణికిస్తున్న క్రిప్టో కరెన్సీ! చాలా దేశాల్లో ప్రత్యామ్నాయ కరెన్సీగా అవతరించింది. మరికొన్ని దేశాల్లో క్రిప్టో ట్రేడింగ్, లావాదేవీలపై నిషేధం కొనసాగుతోంది. ఈ తరుణంలో బ్యాంక్‌లెస్‌టైమ్స్.కామ్ రిప్టోర్టు చేసిన ఓ వార్త సంచలనంగా మారింది. చాలా దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు నేరుగా ఇందులో ఇన్వెస్ట్ చేశాయని తెలిసింది.
ప్రపంచంలోని మొత్తం బిట్‌కాయిన్లలో 8 శాతం వరకు ప్రభుత్వాలు, కంపెనీల వద్దే ఉన్నాయి. 45.8 బిలియన్ డాలర్ల విలువైన 1.6 మిలియన్ల బిట్‌కాయిన్ (BTC)లు వారివేనని తెలిసింది. వీరిలో బల్గేరియా అగ్రస్థానంలో ఉంది. వివిధ దేశాల వద్ద 7.97 బిలియన్ డాలర్ల విలువైన 271,417 బీటీసీలు ఉండగా ఒక్క బల్గేరియా వద్దే 6.27 బిలియన్ డాలర్ల విలువైన 213,519 బిట్‌కాయిన్లు ఉండటం గమనార్హం.
'2009లో బిట్‌కాయిన్ ఆవిష్కరించిన నాటి నుంచి క్రిప్టో కరెన్సీ మార్కెట్లో అనూహ్య మార్పులు వచ్చాయి. అప్పట్లో కొందరికి మాత్రమే వీటిపై అవగాహన ఉండేది. ఇప్పుడు దాదాపుగా అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం చాలామంది బిలియన్ డాలర్ల కొద్దీ డబ్బును ఇందులో ఇన్వెస్ట్ చేశారు. బిట్‌కాయిన్‌పై ఎన్నో అనుమానాలు ఉన్నా మెల్లమెల్లగా దాని విలువపై నమ్మకం పెరుగుతోంది' అని బ్యాంక్‌లెస్.కామ్ సీఈవో జొనాథన్ మెర్రీ అన్నారు.
ప్రస్తుతం బిట్‌కాయిన్ 30,000 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే 50 శాతం వరకు పతనమైంది. క్రిప్టో కరెన్సీలు సంక్షోభ పరిస్థితుల్లో ఉండటమే ఇందుకు కారణం. కాగా బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లు 24 బిలియన్ డాలర్ల విలువైన 816,000 బిట్‌కాయిన్లలో ఇన్వెస్ట్ చేశాయి. గ్రేస్కేల్ బిట్‌కాయిన్ ట్రస్ట్ (GBT), కాయిన్ షేర్, పర్పస్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లు ఈ రంగాన్ని శాసిస్తున్నాయి.
'జీబీటీ వద్దే 18.9 బిలియన్ డాలర్ల విలువైన 644,000 కాయిన్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో 48,466 కాయిన్లతో కాయిన్‌షేర్, 31,453 కాయిన్లతో బిట్‌కాయిన్ ఈటీఎఫ్ ఉన్నాయి' అని ఫైనాన్షియల్ కంటెంట్ స్పెషలిస్టు ఎలిజబెత్ కెర్ అంటున్నారు. ఇక దేశాల వారీగా చూస్తే యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ వద్ద 45,351 బిట్‌కాయిన్లు ఉన్నాయి. అల్ సాల్వెడార్ (9,500), ఫిన్‌ల్యాండ్ (1981), జార్జియా (66) తర్వాతి స్థానంలో ఉన్నాయి.
పబ్లిక్ కంపెనీల వద్ద 7.78 బిలియన్ డాలర్ల విలువైన 266,417 కాయిన్లు ఉన్నాయి. మైక్రో స్ట్రాటజీ కంపెనీ వద్ద 129,000 బీటీసీ, ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా వద్ద 43,000, గ్యాలక్సీ డిజిటల్ హోల్డింగ్స్ వద్ద 16,400 బీటీసీలు ఉన్నాయి. ఇక ప్రైవేటు కంపెనీల వద్ద 5.92 బిలియన్ డాలర్ల విలువైన 202,000 బీటీసీలు ఉన్నాయి.
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య