By: ABP Desam | Updated at : 26 Jul 2022 07:02 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) స్థిరంగా ఉంది. వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే నేడు రూ.100 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,160 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.61,100 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.61,100 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,160గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.61,100 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు తగ్గింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు భారీగా గ్రాముకు రూ.3 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.22,380 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Top Loser Today August 09, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Petrol-Diesel Price, 10 August: వాహనదారులకు షాక్! నేడు ఎగబాకిన ఇంధన ధరలు - మీ నగరంలో ఈరోజు ఇలా
Gold-Silver Price: బంగారం నేడు భారీ షాక్! ఊహించని రీతిలో పైకి - వెండి కూడా పైపైకి
Petrol-Diesel Price, 9 August: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పైకి - మీ నగరంలో ఇవాళ ఇలా
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా
Asia Cup, India's Predicted 11: పాక్ మ్యాచ్కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్ అంచనా నిజమవుతుందా?
Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!
Election For Congress Chief: కాంగ్రెస్ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!
Srisailam Reservoir Gates Opend: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత|ABP Desam