By: ABP Desam | Updated at : 02 Dec 2022 05:50 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Gold-Silver Price 2 December 2022: నిన్నటితో (గురువారం) పోలిస్తే బంగారం ధర (Today's Gold Rate) ఇవాళ (శుక్రవారం) దాదాపు రెండు వందలు పెరిగింది. కిలో వెండి నిన్నటి(గురువారం)తో పోలిస్తే రెండు వేలకుపైగా పెరిగింది.
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 48,750కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹52,180గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹69,800కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 48,750కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 53,180గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹68,800కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 49,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹54,050కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹48,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,180కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 48,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,330 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 48,800గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,230గా ఉంది.
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 48,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,230గా ఉంది.
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 48,750గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,180గా ఉంది.
ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹530 పెరిగింది. ప్రస్తుతం ₹ 26,180వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.
Gold-Silver Prices Today 13 Mar: గుండె గాభరా పెంచుతున్న గోల్డ్ - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Holi Gifts: హోలీ నాడు ఈ ప్రత్యేక బహుమతులు ఇవ్వండి, ఇంప్రెస్ చేయండి - ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ
EPFO: EDLI స్కీమ్‌లో 3 కీలక మార్పులు, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇవి చాలా ముఖ్యం
New Currency Notes: మార్కెట్‌లోకి కొత్త 100, 200 రూపాయల నోట్లు - పాత నోట్లను రద్దు చేస్తారా?
Airtel-Starlink Deal: స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
Group-3 Results: గ్రూప్-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్