search
×

Gold-Silver Price: నేడు బంగారం ధర షాక్! ఏకంగా 400 పైకి - ఇవాల్టి లేటెస్ట్ రేట్స్

Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది.

FOLLOW US: 
Share:

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate)  నిన్నటితో పోలిస్తే నేడు ఏకంగా 10 గ్రాములకు రూ.400 పెరిగింది. వెండి ధర కూడా కిలోకు రూ.400 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,530 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.64,800 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,800 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,530 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,800 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధర నేడు పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.49,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,610 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది.

ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు భారీగా పది గ్రాములకు రూ.180 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.24,620 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 14 Aug 2022 06:41 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

ఇవి కూడా చూడండి

Bajaj Finance Digital FD: బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీల గురించి తెలుసా? భద్రతకి భద్రత లాభానికి లాభం

Bajaj Finance Digital FD: బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీల గురించి తెలుసా? భద్రతకి భద్రత లాభానికి లాభం

Bajaj Finance Insta Personal Loan: అత్యవసర ఖర్చులున్నాయా, అయితే బజాజ్‌ ఫైనాన్స్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ తీసుకోండి

Bajaj Finance Insta Personal Loan: అత్యవసర ఖర్చులున్నాయా, అయితే బజాజ్‌ ఫైనాన్స్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ తీసుకోండి

Latest Gold-Silver Prices Today: మళ్లీ రికార్డ్‌ స్థాయిలో పెరిగిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు కొత్త ఇవి

Latest Gold-Silver Prices Today: మళ్లీ రికార్డ్‌ స్థాయిలో పెరిగిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు కొత్త ఇవి

Gold-Silver Prices Today: గోల్డ్ మంట మామూలుగా లేదు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: గోల్డ్ మంట మామూలుగా లేదు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

SBI Debit Card Charges: ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్, మీ కార్డులు మాకొద్దు మహాప్రభో అనేలా ఉన్నారు!

SBI Debit Card Charges: ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్, మీ కార్డులు మాకొద్దు మహాప్రభో అనేలా ఉన్నారు!

టాప్ స్టోరీస్

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం

Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 

Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు