By: ABP Desam | Updated at : 22 Aug 2022 12:28 AM (IST)
బంగారం, వెండి ధరలు
Gold Price Today 22 August 2022: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ధర మరింత తగ్గితే కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.100 మేర ధర తగ్గి, రెండు రోజులుగా నిలకడగా ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,150 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర నేడు రూ.61,300గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. వెండి నిన్న రూ.700 దిగిరాగా, నేడు వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 22 August 2022) 10 గ్రాముల ధర రూ.52,150 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.61,300 అయింది.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,800 అయింది. 1 కేజీ వెండి ధర రూ.55,600 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కి క్షీణించింది. 1 కేజీ వెండి ధర రూ.55,600 గా ఉంది.
తగ్గిన ప్లాటినం ధర
దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో ప్లాటినం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే అన్ని నగరాలలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
రూ. 23 తగ్గడంతో ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,550 అయింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,550 అయింది.
దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.23,550గా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Aadhaar Card Update: ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం - ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?
PAN Card: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు
Car Insurance: కారు బీమా - వారెంటీల విషయంలో ఓనర్‌లకు ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవీ
Gold Rate Ttoday: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి