search
×

Gold Rate Ttoday: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 98,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 25,320 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices Today: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, తన యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీగా స్కాట్‌ బెసెంట్‌ను ఎంచుకోవడం, ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ 3% పతనమైంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,628 డాలర్ల వద్దకు చేరింది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 1,310 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 1,200 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 980 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర 2,000 రూపాయలు దిగి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,240 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,800 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 57,930 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 98,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,240 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 70,800 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 57,930 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 98,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 77,240 ₹ 70,800 ₹ 57,930 ₹ 98,000
విజయవాడ ₹ 77,240 ₹ 70,800 ₹ 57,930 ₹ 98,000
విశాఖపట్నం ₹ 77,240 ₹ 70,800 ₹ 57,930 ₹ 98,000

 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,080 ₹ 7,724
ముంబయి ₹ 7,080 ₹ 7,724
పుణె ₹ 7,080 ₹ 7,724
దిల్లీ ₹ 7,095 ₹ 7,739
 జైపుర్‌ ₹ 7,095 ₹ 7,739
లఖ్‌నవూ ₹ 7,095 ₹ 7,739
కోల్‌కతా ₹ 7,080 ₹ 7,724
నాగ్‌పుర్‌ ₹ 7,080 ₹ 7,724
బెంగళూరు ₹ 7,080 ₹ 7,724
మైసూరు ₹ 7,080 ₹ 7,724
కేరళ ₹ 7,080 ₹ 7,724
భువనేశ్వర్‌ ₹ 7,080 ₹ 7,724

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,874 ₹ 7,419
షార్జా ‍‌(UAE) ₹ 6,874 ₹ 7,419
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,874 ₹ 7,419
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,881 ₹ 7,329
కువైట్‌ ₹ 6,603 ₹ 7,202
మలేసియా ₹ 6,846 ₹ 7,129
సింగపూర్‌ ₹ 6,795 ₹ 7,539
అమెరికా ₹ 6,571 ₹ 6,992

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 610 తగ్గి రూ. 25,320 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ప్రతి బ్యాంక్‌ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు! 

Published at : 26 Nov 2024 10:30 AM (IST) Tags: Hyderabad Gold Price Today Silver Price Today Vijayawada Todays Gold Silver rates

ఇవి కూడా చూడండి

Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌

Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌

Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?

Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?

Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్‌ బ్యాంక్‌లు - హోమ్‌ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?

Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్‌ బ్యాంక్‌లు - హోమ్‌ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?

PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి

PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి

ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?

ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?

టాప్ స్టోరీస్

Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్

Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్

Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు

Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు

Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?

Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?