By: Arun Kumar Veera | Updated at : 26 Nov 2024 12:44 PM (IST)
పాన్/టాన్ 1.0 ఫ్రేమ్‌వర్క్‌కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ ( Image Source : Other )
PAN 2.0 Project: పన్ను చెల్లింపుదార్ల గుర్తింపు కోసం జారీ చేసే పాన్ కార్డ్ ఇప్పుడు కొత్త హంగుల్లోకి మారుతోంది. ఇకపై, QR కోడ్‌తో కూడిన పాన్ కార్డులను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంది. తద్వారా, పన్ను చెల్లింపుదార్ల డిజిటల్ అనుభవం మరింత మెరుగుపడుతుంది. QR కోడ్‌తో కూడిన పాన్ కార్డుల జారీ కోసం, "పాన్ 2.0 ప్రాజెక్టు" (PAN 2.0 Project)ను ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో పాన్‌ను కోర్ ఐడెంటిఫైయర్‌గా ఉపయోగించడం ప్రభుత్వ నిర్ణయం ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం మొత్తం రూ. 1,435 కోట్లు ఖర్చు చేయనుంది.
"ఫ్రీ"గా QR కోడ్‌తో కూడిన పాన్ కార్డ్
పాన్ 2.0 ప్రాజెక్ట్ కింద, క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాన్ కార్డులను పన్ను చెల్లింపుదారులకు (Taxpayers) ఉచితంగా అందజేస్తామని కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల్లో సాంకేతికంగా పెద్ద మార్పులు తీసుకురావడంలో పాన్ 2.0 ప్రాజెక్ట్ కీలకంగా పని చేస్తుంది. ఫలితంగా, టాక్స్‌పేయర్లు అనేక రకాల ప్రయోజనాలు, సేవలను సులభంగా యాక్సెస్ చేయగలరు. అంతేకాదు, సేవలు వేగవంతం అవుతాయి, నాణ్యత మెరుగుపడుతుంది. మొత్తం సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంటుంది, డేటా సురక్షితంగా ఉంటుంది. ఇది పర్యావరణ అనుకూల ప్రక్రియ కాబట్టి అనవసర ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్‌కు అనుగుణంగా పని చేసే ప్రభుత్వ ఏజెన్సీల డిజిటల్ వ్యవస్థల కోసం పాన్‌ను "సాధారణ వ్యాపార గుర్తింపు"గా ఉపయోగిస్తారు.
ఇప్పటి వరకు 78 కోట్ల పాన్‌లు జారీ
PAN 2.0 ప్రాజెక్ట్ అనేది.. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన డిజిటల్ అనుభవం కోసం పాన్/టాన్ (PAN/TAN) సేవలను సాంకేతికతలోకి మార్చడం ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియను పునర్మించడానికి చేపట్టిన ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్. ఇది, ఇప్పటికే ఉన్న పాన్/టాన్ 1.0 ఫ్రేమ్‌వర్క్‌కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది, పాన్ వెరిఫికేషన్ సర్వీస్‌ను కోర్ & నాన్-కోర్ పాన్/టాన్ యాక్టివిటీలతో అనుసంధానం చేస్తుంది. ఇప్పటివరకు దేశంలో దాదాపు 78 కోట్ల పాన్‌లు జారీ చేయగా, అందులో 98 శాతం పాన్‌లు వ్యక్తిగత స్థాయుల్లోనే జారీ అయ్యాయి.
పాన్ అంటే ఏమిటి?
PAN (Permanent Account Number) అంటే శాశ్వత ఖాతా సంఖ్యకు సంక్షిప్త రూపం. ఆదాయ పన్ను విభాగం జారీ చేసే 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ గుర్తింపు కార్డు ఇది. అంటే.. ఆంగ్ల అక్షరాలు, అంకెల కలబోతతో రూపొందిన గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డు. ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డ్ ఎలాగో, ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు ఒక వ్యక్తికి ఉండే ముఖ్యమైన గుర్తింపు కార్డు 'పాన్'. పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఏ వ్యక్తికైనా దీనిని జారీ చేస్తారు. పాన్ ద్వారా ప్రతి వ్యక్తి ఆన్‌లైన్ లేదా ఆర్థిక లావాదేవీలను ఆదాయ పన్ను విభాగం పర్యవేక్షిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
ITR Filing: ఆదాయం పెరిగింది, ఐటీఆర్‌లు పెరిగాయ్ - టాక్స్‌పేయర్ల సంఖ్య తగ్గింది, ఇదేం విచిత్రం
SIP Risk: సిప్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, రిస్క్ పెంచొచ్చు - ఆలోచించి అడుగేయండి
Gold Price At All Time High: 40 రోజుల్లో 10 రికార్డులు బద్ధలు - నాలుగు రోజుకో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన గోల్డ్
Gold-Silver Prices Today 11 Feb: బ్రేకుల్లేని పసిడి బండి, మళ్లీ కొత్త రికార్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
LIC Portfolio Shares: ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్లు ఇవీ - మీ దగ్గర కూడా ఇవి ఉన్నాయా?
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Chiranjeevi: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం