search
×

Gold Prices: ఆకాశంలో బంగారం ధరలు - గోల్డ్‌ రేట్లకు, డొనాల్డ్‌ ట్రంప్‌నకు కనెక్షన్ ఏంటి?

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ట్రంప్‌ విధానాలు, నిర్ణయాలు పెట్టుబడిదారులలో ఆందోళన పెంచాయి.

FOLLOW US: 
Share:

Connection between gold rates and Donald Trump: గత కొన్ని వారాలుగా, బంగారం ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. 2025 జనవరి 23 గురువారం నాడు గోల్డ్‌ రేట్‌ ఆల్ టైమ్ హై రేంజ్‌కు చేరింది. ఆ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ. 82,900 పలికింది. అయితే, ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అయినప్పటికీ, స్వర్ణం కాంతి ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉంది. పెరుగుతున్న బంగారం ధరలు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నిర్ణయాలతో ముడిపడి ఉన్నాయి.

డొనాల్డ్ ట్రంప్ - బంగారం కనెక్షన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి సారథ్యం చేపట్టిన తర్వాత, బంగారం బండి దూకుడుగా పరుగులు పెడుతోంది. అతని విధానాలు & నిర్ణయాలు గ్లోబల్‌ ఇన్వెస్టర్లలో సందేహాలు, ఆందోళనలు పెంచాయి. జనవరి 20న, ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత, భారత్‌లో బంగారం ధరలు పది గ్రాములకు రూ. 81,273 నుంచి రూ. 82,900కి పెరిగాయి. అంటే కేవలం వారం రోజుల్లోనే పది గ్రాములకు రూ. 1692 పెరుగుదల నమోదైంది.            

బంగారం సురక్షిత పెట్టుబడి సాధనం
ట్రంప్ పరిపాలన సుంకాలు & ఆంక్షలు ప్రపంచ మార్కెట్లలో ఉద్రిక్తతలు పెంచాయి. యుఎస్, మెక్సికో, కెనడాపై సుంకాలు విధించే నిర్ణయం & ఇతర వాణిజ్య విధానాలు బంగారం వంటి సురక్షితమైన స్వర్గధామాల వైపు పెట్టుబడిదారులను ఆకర్షించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చు. ఫలితంగా, బాండ్ రాబడులు & డాలర్ ఇండెక్స్‌లో పతనం కనిపించొచ్చు. ఈ కారణాల వల్ల బంగారానికి డిమాండ్, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పరుగు
జనవరి 20 నుంచి జనవరి 26 వరకు చూస్తే... ఈ కాలంలో డాలర్ ఇండెక్స్ 1.53 శాతం క్షీణించింది. 109.35 నుంచి 107.67 స్థాయికి దిగజారింది. న్యూయార్క్‌లోని కోమెక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 2,748.70 డాలర్ల నుంచి 2,799.47 డాలర్లకు పెరిగి, 1.85 శాతం ర్యాలీ చేశాయి.

గత 70 రోజుల్లో, 10 గ్రాముల పసిడి (24 కేరెట్లు) ధర సుమారు రూ. 5,800 పెరిగింది. నవంబర్ 15న, 10 గ్రాముల బంగారం రూ. 75,813 వద్ద ఉండగా, జనవరి 25న అత్యధికంగా రూ. 82,900కి చేరింది. ట్రంప్ విధానాల వల్ల ఉత్పన్నమ్యయే అనిశ్చితి & ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల తర్వాత గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

భారతదేశానికి వస్తే.. గ్లోబల్‌ ఫ్యాక్టర్స్‌తో పాటు, 2025 ఫిబ్రవరి 01 నాటి కేంద్ర బడ్జెట్‌ (Budget 2025)లో, పసిడిపై కస్టమ్స్‌ సుంకం గురించి వెలువడే నిర్ణయం కూడా మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది.

స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడులపై 'abp దేశం' ఎవరికీ సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

మరో ఆసక్తికర కథనం: బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరుగుతాయా, కస్టమ్ డ్యూటీపై కేంద్రం ఆలోచన ఏంటి? 

Published at : 28 Jan 2025 03:30 PM (IST) Tags: Donald Trump Gold Gold Price Hike Gold Today Price Gold Prices in India

ఇవి కూడా చూడండి

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

టాప్ స్టోరీస్

Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు

Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన

MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!

MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు  బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!

MLC Kavitha Resignation Accepted: పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!

MLC Kavitha Resignation Accepted: పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!