search
×

Gold Price: బంగారం కొనేందుకు ఇదే బెస్ట్‌ టైమ్‌! నెల రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్‌!

Gold Price: అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వరుసగా నాలుగో వారం పుత్తడి లాభాల్లోనే ముగియడం గమనార్హం.

FOLLOW US: 

Gold Price: అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వరుసగా నాలుగో వారం పుత్తడి లాభాల్లోనే ముగియడం గమనార్హం. మానసిక స్థాయిగా భావించే 1800 డాలర్లకు ఔన్స్‌ ధర చేరువైంది. అక్టోబర్‌ గోల్డ్ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులు రూ.52,579 స్థాయిల్లో ఉన్నాయి. గత శుక్రవారం నాటి 51,864తో పోలిస్తే 1.37 శాతం పెరిగాయి.

అమెరికా ద్రవ్యోల్బణం కాస్త తగ్గడంతో డాలర్‌ విలువ తగ్గుముఖం పడుతుందని కమోడిటీ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డాలర్‌ సూచీ 5 వారాల కనిష్ఠానికి చేరుకోవడంతో బంగారం ధర 5 వారాల గరిష్ఠానికి చేరుకుందని గుర్తు చేస్తున్నారు. మున్ముందు మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అతి త్వరలోనే ఎంసీఎక్స్‌లో 10 గ్రాములు బంగారం ధర రూ.53,500 స్థాయికి చేరుకుంటుందని కమొడిటీ నిపుణులు చెబుతున్నారు. అందుకే ధర తగ్గినప్పుడల్లా ఈ విలువైన లోహంలో పెట్టుబడి పెట్టాలని వారు  సూచిస్తున్నారు. స్పాట్‌ బంగారం ధరలు ఔన్స్‌కు 1760 నుంచి 1820 డాలర్ల మధ్య చలిస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధాన నిరోధం దాటితే 1820 డాలర్లు దాటడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

'అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు మించే తగ్గడం ఈ వారం ప్రధానాంశం. యూఎస్‌ కన్జూమర్స్‌ ఇండెక్స్‌ 8.5 శాతానికి చేరుకుంది. జూన్‌లో నమోదైన 9.1 శాతం కన్నా ఇది తక్కువే. ఉత్పత్తిదారుల ద్రవ్యోల్బణం 9.8 శాతంగా ఉంది. సరఫరా గొలుసులో అంతరాలు తొలగిపోయి పరిస్థితులు మెరుగవ్వడమే ఇందుకు కారణం' అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ విశ్లేషకుడు సుగంధ సచ్‌దేవా అన్నారు. ప్రస్తుతానికి మార్కెట్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. ధరలు తగ్గుతుండటంతో యూఎస్‌ ఫెడ్‌ సెప్టెంబర్లో వడ్డీరేట్లను 75బీపీఎస్‌తో పోలిస్తే 50 బేసిస్‌ పాయింట్లే పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఇలాగే పెరుగుతాయని ఐఐఎఫ్‌ఎల్‌ రీసెర్చ్‌ ఉపాధ్యక్షుడు అనుజ్‌ గుప్తా సైతం అంటున్నారు. 'గోల్డ్‌ ఔట్‌లుక్‌ మెరుగ్గా ఉంది. స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ ధర 1760-1820 డాలర్ల మధ్య కొనసాగితే ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం మంచి వ్యూహం. తక్కువ స్థాయిలో కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించొచ్చు. ఒకవేళ పుత్తడి 1820 డాలర్ల స్థాయిలో నిలదొక్కుకుంటే అట్నుంచి 1855, 1860 స్థాయిలకు చేరుకోవచ్చు' అని ఆయన అంచనా వేశారు. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 52,000 స్థాయిలో నిలబడితే రూ.53,000కు చేరుకోవచ్చని అన్నారు.

ప్రస్తుత స్థాయిల్ని నిలదొక్కుకోకుంటే మాత్రం 10 గ్రాముల బంగారం రూ.51,400-51,200కు దిగొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మళ్లీ ఆ స్థాయిలో కొనుగోలు చేస్తే రూ.53,500 వద్ద విక్రయించేందుకు అవకాశం దొరకుతుందని వెల్లడించారు.

Published at : 13 Aug 2022 01:51 PM (IST) Tags: gold Gold Price Gold Buying dollar Index gold futures

సంబంధిత కథనాలు

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల నిబంధనల్లో కీలక మార్పు చేసిన మోదీ సర్కార్‌!

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల నిబంధనల్లో కీలక మార్పు చేసిన మోదీ సర్కార్‌!

Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

Gold-Silver Price 20 September 2022: స్వర్ణ కాంతి తగ్గింది, వెండి దూకుడు ఆగింది - ఇవాళ్టి రేట్లు ఇవి

Gold-Silver Price 20 September 2022: స్వర్ణ కాంతి తగ్గింది, వెండి దూకుడు ఆగింది - ఇవాళ్టి రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు