search
×

Gold Loan: అకస్మాత్తుగా డబ్బు అవసరం పడిందా? తక్షణం అప్పు పుట్టించే ఉత్తమ మార్గం ఇది

ఇతర లోన్ల తరహాలో బ్యాంకర్లకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పని లేదు, సమాధానాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే ఉండదు.

FOLLOW US: 
Share:

Gold Loan: డబ్బు అవసరం లేని మనిషి ఈ భూమ్మీద ఉండడు. కాకపోతే, 'ఎంత అవసరం' అన్నది పరిస్థితులను బట్టి మారుతుంది. ఒక్కోసారి అకస్మాత్తుగా డబ్బు అవసరం పడవచ్చు. మన చేతిలో డబ్బు, బ్యాంక్‌లో బ్యాలెన్స్‌ రెండూ లేక అల్లాడిపోతాం. అటువంటి పరిస్థితిలో, బయటి నుంచి రుణం తీసుకోవడమే ఏకైక మార్గం. ఈ సమయంలో, మీ ఇంట్లో ఉన్న బంగారమే మీకు అత్యంత ఉపయోగపడుతుంది. బంగారం మీద రుణాన్ని సులభంగా పొందవచ్చు. బంగారం మీద పెట్టుబడి చాలా ప్రయోజనకరం అని భారతదేశ ప్రజలు భావిస్తారు.

బ్యాంకింగ్‌ సదుపాయాలు సరిగా అందుబాటులో లేని సమయంలో, అకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు, ప్రజలు తమ డబ్బు అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని అమ్మేవారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ సామాన్యుడికి చేరువయ్యాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బ్యాంకులు బంగారానికి బదులుగా రుణాలను సులభంగా ఇస్తున్నాయి. గోల్డ్ లోన్‌లో, బంగారాన్ని పూచీకత్తుగా పెట్టుకుని బ్యాంకులు అప్పులు ఇస్తాయన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ రకమైన రుణాన్ని పొందడంలో ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి.

రుణానికి త్వరగా ఆమోదం
చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు సులభంగా కొలేటరల్ లోన్ (తనఖా లోన్‌) ఇస్తాయి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీ బంగారం విలువలో 75% వరకు రుణంగా పొందవచ్చు. ఈ లోన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, గోల్డ్‌ లోన్‌ పొందడానికి మీకు ఆదాయ రుజువు అవసరం లేదు. కేవలం బంగారం మాత్రం ఇస్తే చాలు, బ్యాంకులు వెంటనే రుణాన్ని మంజూరు చేస్తాయి. ఇతర లోన్ల తరహాలో బ్యాంకర్లకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పని లేదు, సమాధానాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే ఉండదు.

వడ్డీ రేటు తక్కువ
బంగారం మీద ఇచ్చే రుణాన్ని సురక్షిత రుణంగా పరిగణిస్తారు. ఇవి సురక్షిత రుణాలు కాబట్టే బ్యాంకులు ఈ లోన్‌ మీద తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, కార్పొరేట్ రుణాలు మొదలైన చాలా రిస్కీ లోన్ల మీద బ్యాంకులు 15 నుండి 30 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కానీ, సాధారణంగా బంగారు రుణం మీద 7 నుంచి 10 శాతం వడ్డీ రేటును మాత్రం వసూలు చేస్తాయి. వ్యవసాయ అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్‌ తీసుకుంటే, ఇంకా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి.

అధిక రుణ విలువ
వినియోగదారులు సాధారణంగా బంగారు రుణాల మీద గరిష్ట రుణ విలువను పొందుతారు. బ్యాంక్‌ వద్ద తనఖా పెట్టిన బంగారం విలువలో 75 శాతం వరకు సులభంగా పొందవచ్చు, ఇతర రుణాలతో పోల్చితే చాలా ఎక్కువ. దీంతో పాటు, ఈ లోన్‌ మీద సులభమైన రీ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా, మీరు మీ అవసరానికి అనుగుణంగా లోన్‌ రీ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. బంగారం మీద రుణాన్ని ఏడాది కాలానికి బ్యాంకులు ఇస్తాయి. ఈ ఏడాదిలో మీరు అప్పు చెల్లించలేకపోతే, అదే లోన్‌ను పునరుద్ధరించునే వెసులుబాటు ఉంది.

Published at : 10 Jan 2023 03:44 PM (IST) Tags: Gold loan Bank Loan Gold Loan Tips

ఇవి కూడా చూడండి

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

టాప్ స్టోరీస్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్

Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం