By: Arun Kumar Veera | Updated at : 12 Jul 2024 03:18 PM (IST)
ఎఫ్‌డీ మీద ఎక్కువ వడ్డీ ( Image Source : Other )
Fixed Deposit Rates 2024: బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒక స్థిరమైన ఆదాయ & సురక్షితమైన పెట్టుబడి మార్గం. FDలో ఉన్న మరో యొక్క ప్రయోజనం ఏమిటంటే, వివిధ మెచ్యూరిటీ పిరియడ్స్ అందుబాటులో ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఒక టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు ఇప్పటికే బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే, KYC ప్రాసెస్ అవసరం లేకుండా FD స్టార్ట్ చేయొచ్చు.
12 బ్యాంక్‌లు అందిస్తున్న గరిష్ట వడ్డీ రేట్లు (Highest interest rates on bank deposits)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)
మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ (SBI). 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.00 వడ్డీ రేటును ఎస్‌బీఐ ఆఫర్ చేస్తోంది. ప్రత్యేక డిపాజిట్లు మినహా, మిగిలిన కాలాలకు ఇంత వడ్డీ రేటు లభించడం లేదు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank)
444 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ఇస్తున్న వడ్డీ రేటు 7.30 శాతం. ఈ బ్యాంక్‌లోని మిగిలిన అన్ని ఎఫ్‌డీల మీద ఉన్న వడ్డీ రేట్ల కంటే ఇదే ఎక్కువ వడ్డీ రేటు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)
ప్రభుత్వ రంగంలోని PNBలో 400 రోజుల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తీసుకుంటే ఏడాదికి 7.25 శాతం చొప్పున వడ్డీ డబ్బు సంపాదించొచ్చు. ఈ బ్యాంక్‌లో మరే ఇతర డిపాజిట్‌పై ఇంత పెద్ద మొత్తం రాదు.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కూడా 2 సంవత్సరాల పైన - 3 సంవత్సరాల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం గరిష్టంగా 7.25 శాతం ఇంట్రెస్ట్ రేట్ అమలు చేస్తోంది.
బంధన్ బ్యాంక్ (Bandhan Bank)
12 నెలల కాల వ్యవధి ఎఫ్‌డీల మీద గరిష్టంగా 7.80 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ ప్రకటించింది. ఈ బ్యాంక్ డిపాజిట్లలో ఇదే ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు.
ఫెడరల్ బ్యాంక్ (Federal Bank)
ఈ బ్యాంక్ కూడా 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ కోసం 7.40 శాతం ఇంట్రెస్ట్ రేట్‌ను ఆఫర్ చేస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)
దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 18 నెలల నుంచి 21 నెలల కాలానికి, ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 7.25 శాతం వడ్డీ ఆదాయాన్ని అందిస్తోంది.
కోటక్ మహీంద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank)
ప్రైవేట్ రంగంలోని పెద్ద బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో 391 రోజుల నుంచి 23 నెలల లోపు కాలం కోసం డబ్బు డిపాజిట్ చేస్తే, అత్యధికంగా 7.40 శాతం వడ్డీ రాబడి వస్తుంది.
యెస్ బ్యాంక్ (Yes Bank)
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ యెస్ బ్యాంక్, 18 నెలల టెన్యూర్ డిపాజిట్లకు గరిష్టంగా 8.0 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank)
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) కేటగిరీలో ఈ బ్యాంక్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈ బ్యాంక్ కూడా 18 నెలల టెన్యూర్ డిపాజిట్లపై గరిష్టంగా 8.0 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Ujjeevan Small Finance Bank)
SFB కేటగిరీలో మరో ప్రముఖ బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్ గరిష్టంగా 8.45 శాతం వడ్డీని చెల్లిస్తానని ప్రకటించింది. 12 నెలల కాలానికి చేసే డిపాజిట్ల మీద ఇంత పెద్ద మొత్తంలో వడ్డీని స్వీకరించవచ్చు.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank)
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 444 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఆ డిపాజిట్లపై గరిష్టంగా 8.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
మీరు ఎఫ్‌డీ అకౌంట్ తెరవాలంటే, ఆన్‌లైన్‌లో ప్రారంభించొచ్చు లేదా సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించొచ్చు. FD ఖాతా తెరవడం గతంలో కంటే ఇప్పుడు మరింత సులభంగా మారింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో వేడి పెంచిన పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
PF Loan: డబ్బు అవసరనప్పుడు ఆదుకునే PF లోన్ - దరఖాస్తు చేయడం సులభం
Income Tax Benifit: కుటుంబంతో కలిసి జాలీగా హాలిడే ట్రిప్స్ వేయండి, పన్ను మిహాయింపు పొందండి
GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం
Gold-Silver Prices Today 21 Mar: భారీగా పతనమైన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ITR filing: ఐటీఆర్ ఫైల్ చేసినవాళ్లు 9 కోట్ల మంది - కోటీశ్వరుల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోతారు
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్