search
×

Fixed Deposit: గుడ్‌న్యూస్‌, ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్‌ స్కీమ్‌ గడువు పెంచిన HDFC బ్యాంక్

ఈ స్కీమ్‌ ద్వారా సీనియర్‌ సిటిజన్లకు 0.75 శాతం ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తుంది.

FOLLOW US: 
Share:

HDFC Senior Citizen Care FD: దేశంలో అతి పెద్ద లెండర్‌ HDFC బ్యాంక్, తన స్పెషల్‌ టర్మ్ డిపాజిట్ స్కీమ్ "సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ" గడువు పొడిగించింది. పేరుకు తగ్గట్లుగా, ఈ పథకాన్ని కేవలం సీనియర్‌ సిటిజన్స్‌ కోసమే డిజైన్‌ చేసింది.

అధిక వడ్డీ రేట్లు ఆఫర్‌ చేసే ఈ స్కీమ్‌ గడువు ఈ నెల 7వ తేదీతోనే ముగిసింది. అయితే, కస్టమర్లను ఆకర్షించడానికి HDFC బ్యాంక్ మరోసారి ప్రోగ్రాం లాస్ట్‌ డేట్‌ను ఈ ఏడాది నవంబర్ 7వ తేదీ వరకు, 4 నెలలు పొడిగించింది. సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పథకాన్ని 2020 మే 18న బ్యాంక్‌ ప్రారంభించింది. అప్పటి నుంచి దీని గడువును చాలాసార్లు ఎక్స్‌టెండ్‌ చేసింది.

'సీనియర్ సిటిజన్ కేర్ FD'పై 0.75 శాతం ఎక్కువ వడ్డీ ఆదాయం
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల టెన్యూర్‌తో ఈ టర్మ్‌ డిపాజిట్‌ తీసుకోవచ్చు. HDFC బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ కాల వ్యవధుల్లో ఉండే డిపాజిట్లకు సాధారణ పౌరులకు 7 శాతం ఇంట్రెస్ట్‌ రేట్‌ లభిస్తోంది. ఇవే టర్మ్‌ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీని బ్యాంక్‌ పే చేస్తోంది. 'సీనియర్ సిటిజన్ కేర్' స్కీమ్‌లో డిపాజిట్‌ చేస్తే మరో 0.25 శాతం వడ్డీ రేట్‌ యాడ్‌ అవుతుంది. సాధారణ పౌరులతో పోలిస్తే, ఈ స్కీమ్‌ ద్వారా సీనియర్‌ సిటిజన్లకు 0.75 శాతం ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఈ స్కీమ్‌పై ప్రస్తుతం ఇస్తున్న ఇంట్రెస్ట్‌ రేట్‌ 7.75 శాతం. రూ. 5 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

ప్రీ-క్లోజర్‌ ఛార్జీలు
'సీనియర్ సిటిజన్ కేర్ FD'ని ఐదేళ్ల తర్వాత - మెచ్యూరిటీకి ముందే క్లోజ్‌ చేస్తే 1.25 శాతం పెనాల్టీని బ్యాంక్‌ విధిస్తుంది. 5 సంవత్సరాలకు ముందే మూసివేస్తే 1 శాతం పెనాల్టీ విధిస్తుంది.

సీనియర్ సిటిజన్ల కోసం HDFC బ్యాంక్‌ అందిస్తున్న FD స్కీమ్స్‌
7 రోజుల నుంచి 29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDపై 3.50% వడ్డీని సీనియర్‌ సిటిజన్స్‌ పొందుతారు 
30 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్‌పై FDపై 4% వడ్డీ ఆదాయం
46 రోజుల నుంచి 6 నెలల FDపై 5% ఇంట్రెస్ట్‌ రేట్‌ 
6 నెలల 1 రోజు నుంచి 9 నెలల టర్మ్‌ డిపాజిట్‌ మీద 6.25% వడ్డీ 
9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరంలో మెచ్యూర్‌ అయ్యే FDపై 6.50 శాతం వడ్డీ
1 సంవత్సరం నుంచి 15 నెలల కాలానికి 7.10 శాతం వడ్డీ ఆదాయం 
15 నెలల నుంచి 18 నెలల FDపై 7.60 శాతం ఇంట్రెస్ట్ రేట్‌ 
18 నెలల నుంచి 4 సంవత్సరాల 7 నెలల డిపాజిట్‌పై 7.50% వడ్డీ
2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు సాగే FDపై 7.70% ఇంట్రెస్ట్‌ రేట్‌

ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో, అన్ని ఎఫ్‌డీల మీద వడ్డీ ఆదాయం నాన్-సీనియర్ సిటిజన్లకు రూ.40,000, సీనియర్ సిటిజన్స్‌కు రూ.50,000 దాటితే TDS కట్‌ అవుతుంది.

పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌తో పోలిస్తే... 
HDFC బ్యాంక్‌ 'సీనియర్ సిటిజన్ కేర్ FD' స్కీమ్ కంటే పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఎక్కువ వడ్డీని అందిస్తోంది. ఇది కూడా సీనియర్ సిటిజన్ల కోసమే ప్రారంభమైంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 8.2 శాతం వడ్డీ రేటు అందుతుంది. 60 ఏళ్లు పైబడిన ఇండియన్‌ సిటిజన్‌ ఇందులో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు, దానిని గరిష్టంగా మరో 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్‌పై లాభాలొస్తే 'క్యాపిటల్‌ గెయిన్స్‌' కింద కచ్చితంగా వెల్లడించాలి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 14 Jul 2023 02:06 PM (IST) Tags: Fixed Deposit HDFC bank Special FD high interest rate

ఇవి కూడా చూడండి

Honda SP 125: ట్యాంక్‌ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్‌! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?

Honda SP 125: ట్యాంక్‌ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్‌! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?

PPF, SSY, NSC: పోస్టాఫీస్‌ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం

PPF, SSY, NSC: పోస్టాఫీస్‌ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం

Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

ATM Withdrawal Fee: ATM నుంచి డబ్బు తీస్తే రూ.23 బాదుడు, తస్మాత్‌ జాగ్రత్త!

ATM Withdrawal Fee: ATM నుంచి డబ్బు తీస్తే రూ.23 బాదుడు, తస్మాత్‌ జాగ్రత్త!

Canadian Salary: కెనడాలో C$30,000 జీతం సంపాదిస్తే భారత్‌లో దాని విలువ ఎంత? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

Canadian Salary: కెనడాలో C$30,000 జీతం సంపాదిస్తే భారత్‌లో దాని విలువ ఎంత? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

టాప్ స్టోరీస్

CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం

CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం

Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా