By: ABP Desam | Updated at : 14 Jul 2023 12:24 PM (IST)
మ్యూచువల్ ఫండ్స్‌పై లాభాలొస్తే 'క్యాపిటల్ గెయిన్స్' కింద కచ్చితంగా వెల్లడించాలి
ITR Filing For AY24: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేస్తున్నారా?. అయితే, గత ఫైనాన్షియల్ ఇయర్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం (capital gains) సంపాదిస్తే, దానిని మీ ITRలో రిపోర్ట్ చేయడం మాత్రం మరిచిపోవద్దు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయ పన్ను పత్రాల్లో వెల్లడించడం చాలా ముఖ్యం. మీరు దీనిని మరిచిపోయినా, కావాలనే వెల్లడించకపోయినా చాలా ఈజీగా దొరికిపోతారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు చేసే ప్రతి ట్రాన్జాక్షన్ ఆదాయ పన్ను విభాగం దగ్గర రికార్డ్ అవుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే లాభాల మీద 'వర్తించే పన్ను' (Income Tax on Mutual Fund Profits) అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను మీరు ఎంత కాలం పాటు హోల్డ్ చేశారు అన్నది కీలకమైన అంశం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ సహా ఏ రకమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో మీరు ఉన్నా అన్నింటి పైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
హోల్డింగ్ పిరియడ్ ఆధారంగా టాక్స్
మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, కొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం లోపులోనే అమ్మి లాభం సంపాదిస్తే, అది స్వల్పకాలిక మూలధన లాభం (short term capital gain - STCG) కిందకు వస్తుంది. దీనిపై 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభం పన్ను (short term capital gains tax) చెల్లించాలి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, కొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత అమ్మి లాభం సంపాదిస్తే, అది దీర్ఘకాలిక మూలధన లాభం (long term capital gain - LTCG) కిందకు వస్తుంది. దీనిపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను (long term capital gains tax) చెల్లించాలి.
అయితే, ఏడాదికి రూ. 1 లక్ష వరకు దీర్ఘకాలిక మూలధన లాభంపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా, రూ. లక్ష కంటే ఎక్కువ లాభంపై 10% పన్ను చెల్లించాలి.
ఈ డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోండి
మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను అమ్మి లాభం సంపాదిస్తే, చాలా విషయాలపై దృష్టి పెట్టాలి. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు, ఫామ్ 16తో పాటు ఫామ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), టాక్స్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (TIS), క్యాపిటల్ గెయిన్ స్టేట్‌మెంట్‌ను దగ్గర పెట్టుకోవాలి. మీరు ఇన్‌కం టాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, ఈ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు కొన్న, విక్రయించిన మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విలువల గురించిన పూర్తి సమాచారం AIS, TISలో ఉంటుంది. క్యాపిటల్ గెయిన్ స్టేట్‌మెంట్‌లో, స్వల్పకాలిక/దీర్ఘకాలిక మూలధన లాభం ఎంతో చూడవచ్చు.
షెడ్యూల్ 112Aలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మూలధన లాభాలను; షెడ్యూల్ CGలో స్వల్పకాలిక మూలధన లాభాలను రిపోర్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ కూడా మీరు పొందితే, దానిని ఇతర ఆదాయ వనరుల్లో (Schedule of Other Sources) చూపాలి.
మరో ఆసక్తికర కథనం: బియ్యం రేట్లు భారీగా తగ్గే ఛాన్స్, ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ