By: Arun Kumar Veera | Updated at : 29 Jun 2024 10:08 AM (IST)
జులైలో చాలా మార్పులు
Financial Deadlines For July 2024: క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే, మన దేశంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. జూన్ ముగిసి జులై మొదలు కాగానే కొన్ని ఆర్థిక విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. జులైలో, ప్రజలు పూర్తి చేయాల్సిన కొన్ని డెడ్‌లైన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ముందే తెలుసుకోకపోతే ఆర్థికంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది.
జులై 2024లో మారే విషయాలు:
--- జులై 03 నుంచి మీ మొబైల్ రీఛార్జ్ చేయడానికి మరికొంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్లాన్ రేట్లను పెంచాయి.
--- పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు చెందిన ఇన్‌యాక్టివ్ వాలెట్లను (Paytm Payments Bank Wallet) జులై 20వ తేదీ నుంచి మూసేస్తామని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. గత ఏడాది కాలంలో ఒక్క లావాదేవీ కూడా జరగని పేటీఎం వాలెట్‌లను (Paytm wallet) ఆ సంస్థ క్లోజ్ చేస్తుంది.
--- మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలు జులై 01 నుంచి మారతాయి. టెలికాం నియంత్రణ సంస్థ TRAI, సిమ్ కార్డ్ దొంగతనం లేదా స్వాప్ మోసాలను నిరోధించడానికి లాకింగ్ పిరియడ్‌ను ఏడు రోజులకు కుదించింది. గతంలో ఈ గడువు 10 రోజులుగా ఉంది.
--- ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ICICI Bank Credit Card) కొత్త నియమాలు జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. వచ్చే నెల నుంచి వినియోగదార్లు కార్డ్ రీప్లేస్‌మెంట్ కోసం 100 రూపాయలకు బదులు 200 రూపాయలు చెల్లించాలి.
--- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB RuPay Debt Card) రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ 'లాంజ్ యాక్సెస్ రూల్స్' కూడా మారాయి. జులై 01 నుంచి, కస్టమర్‌లు త్రైమాసికంలో 1 దేశీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌ను పొందుతారు. ఏడాదిలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
--- పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాను మీరు చాలా కాలం ఉపయోగించకపోతే, ఆ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉంటే, జులై 01 నుంచి ఆ ఖాతాను బ్యాంక్ క్లోజ్ చేస్తుంది.
--- సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లందరూ (Citi Bank Credit Card) తమ క్రెడిట్ కార్డ్ ఖాతాలను జులై 15లోగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి.
--- జులై 01 నుంచి, అన్ని బ్యాంకులు 'భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్' ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేయాలి. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ సహా చాలా బ్యాంకులు ఇంకా దీనిని యాక్టివేట్ చేసుకోలేదు. ఇప్పటివరకు కేవలం 8 బ్యాంకులు మాత్రమే BBPSలో బిల్లు చెల్లింపును యాక్టివేట్ చేశాయి.
--- ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ల (SBI Credit Card) ద్వారా జరిగే ప్రభుత్వ సంబంధ లావాదేవీలపై జులై 01 నుంచి రివార్డ్ పాయింట్లను ఇవ్వరు.
--- 2023-24 ఆర్థిక సంవత్సరం/ 2024-25 మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి (IT Return Filing Deadline) గడువు 31 జులై 2024తో ముగుస్తుంది. ఆ తర్వాత పెనాల్టీ చెల్లించి ఐటీఆర్ ఫైల్ చేయాలి.
--- ప్రతి నెల ఒకటో తేదీన, పెట్రోలియం కంపెనీలు LPG సిలిండర్ ధరలను సవరిస్తాయి. జులై 01 నుంచి వంట గ్యాస్ సిలిండర్ రేటు మారే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: జనానికి మళ్లీ మొండిచెయ్యి - పోస్టాఫీస్ పథకాలపై పైసా కూడా పెరగని వడ్డీ రేట్లు
Diwali Stock Picks: ధనలక్ష్మికి ఆహ్వానం పలికే షేర్లు ఇవి - దీపావళి కల్లా కాసుల వర్షం ఖాయమట!
Dhanteras 2024: మీరు కొనేది అసలు బంగారమో, కాకి బంగారమో మీరే కనిపెట్టొచ్చు
Dhanteras 2024: ధన్తేరస్ గోల్డ్ షాపింగ్‌లో ఈ ఒక్కటీ చూడకపోతే మీ పని సున్నా!
Gold-Silver Prices Today 29 Oct: ధన్తేరస్ ఫీవర్‌తో ధనాధన్ పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Diwali 2024: దీపావళి స్పెషల్ స్టాక్స్ - అనతి కాలంలో అధిక లాభాలు మీ సొంతం!
IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
Best Cars Without Waiting Period: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్