By: ABP Desam | Updated at : 21 Dec 2023 02:39 PM (IST)
10 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయకపోతే మీకు ఆర్థిక నష్టం!
Financial Deadlines on 31 December 2023: డిసెంబర్(December 2023) నెలలో ఇంకా 10 రోజులే మిగిలి ఉన్నాయి. అంటే, మరో 10 రోజుల్లో 2023 సంవత్సరాన్ని కూడా దాటేస్తాం. మనలో చాలామంది ఈ ఏడాదిలో తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాటికి, డబ్బుకు లింకుంది. గడువులోగా ఆ పనులు పూర్తి చేయకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
ఆ పనుల్లో... డీమ్యాట్ ఖాతా నామినేషన్ దగ్గర నుంచి హోమ్ లోన్ ఆఫర్ వరకు ఉన్నాయి. ఆర్థిక నష్టాన్ని ఆపాలని మీరు అనుకుంటే, ఈ పనులన్నీ త్వరగా ఫినిష్ చేయండి.
డిసెంబర్ 31 లోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన పనులు (Things to be completed by December 31):
1. డీమ్యాట్ ఖాతాలో నామినేషన్ (Nomination in Demat Account)
మీకు మీ మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టుబడులు ఉంటే.. మీ ఖాతాలో నామినేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. దీని గడువు 2023 డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ పని పూర్తి కాకపోతే, మీ మ్యుచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. నామినీని జోడించిన తర్వాతే మళ్లీ యాక్టివేట్ అవుతుంది. అప్పటి వరకు ఆ అకౌంట్‌లో మీరు ఏ ట్రాన్జాక్షన్ చేయలేరు.
2. బ్యాంక్‌తో లాకర్ అగ్రిమెంట్ (Locker Agreement with Bank)
కొత్త లాకర్ ఒప్పందంపై సంతకం చేయడానికి వినియోగదార్లందరికీ డిసెంబర్ 31, 2023 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గడువు విధించింది. మీకు ఒక బ్యాంక్ లాకర్ ఉండి, ఇంకా కొత్త ఒప్పందంపై సంతకం చేయకపోతే, వీలైనంత త్వరగా బ్యాంక్‌కు వెళ్లి అగ్రిమెంట్ చేసుకోండి. లేదంటే తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
3. ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం (SBI Amrit Kalash Scheme)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్‌లో పెట్టుబడి పెట్టే గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ పథకం కింద, సాధారణ కస్టమర్లు 400 రోజుల ప్రత్యేక FD మీద 7.10 శాతం వడ్డీ రేటు పొందుతారు. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది.
4. ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు (Deadline for filing ITR)
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆలస్య రుసుముతో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి గడువు మరో 10 రోజుల్లో (డిసెంబర్ 31) ముగుస్తుంది. ఈ లోగా ఐటీ పత్రాలు దాఖలు చేయలేకపోతే ఆదాయపు పన్ను నోటీసులు మీ ఇంటిని వెతుక్కుంటా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ITR ఫైల్ చేయడానికి, పన్ను కట్టాల్సిన ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వాళ్లు రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు రూ.5000 జరిమానా చెల్లించాలి.
5. హోమ్ లోన్ ఆఫర్ (Home Loan Offer)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పండుగ సీజన్‌లో ప్రత్యేక హోమ్ లోన్ ఆఫర్ ప్రకటించింది. దీని గడువు కూడా డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ ఆఫర్ ప్రకారం, హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు మీద 0.17 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు, ఏడాదికి 8.40 శాతం వడ్డీకే గృహ రుణం తీసుకోవచ్చు. అంటే, ఈ ప్రత్యేక ఆఫర్ కింద, కస్టమర్లకు 0.65 శాతం వడ్డీ రేటు తగ్గుతుంది.
6. యూపీఐ ఐడీ డీయాక్టివేషన్ (Deactivation of UPI IDs)
గత ఏడాది కాలంగా తమ UPI IDని ఉపయోగించని కస్టమర్లకు ఇది కీలక అప్‌డేట్. అలాంటి వ్యక్తుల యూపీఐ ఐడీలు డిసెంబర్ 31 తర్వాత డీయాక్టివేట్ అవుతాయి. కాబట్టి, మీరు గత ఒక సంవత్సరంగా మీ UPI IDని ఉపయోగించకుంటే, ఆ ఐడీని ఉపయోగించి ఇప్పుడే చిన్నపాటి ట్రాన్జాక్షన్ అయినా చేయండి. దీనివల్ల మీ ID డీయాక్టివేట్ కాకుండా ఆగుతుంది.
మరో ఆసక్తికర కథనం: పొదుపు ఖాతాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు, ఈ ఆఫర్‌ని మిస్ కావద్దు
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్- టాప్ స్కోరర్‌గా నితీశ్