By: Arun Kumar Veera | Updated at : 04 Jan 2025 10:39 AM (IST)
రెండు పైలెట్ ప్రాజెక్ట్‌లు విజయవంతం ( Image Source : Other )
Pension Withdrawal From Any Bank Anywhere: కోట్లాది మంది EPFO చందాదారులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన నూతన సంవత్సరం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో పెన్షనర్లకు పెద్ద బహుమతి దొరికింది. దేశంలోని EPFO అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ (Centralized Pension Payments System - CPPS) పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈ పని డిసెంబర్ 2024 నాటికి పూర్తయింది. డిసెంబర్ 2024 నాటికి, 68 లక్షల మందికి పైగా ఉన్న EPS పెన్షనర్లకు సుమారు రూ.1570 కోట్ల విలువైన పెన్షన్ పంపిణీ జరిగింది.
దేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్ సంపూర్ణంగా అమల్లోకి రావడంతో, పింఛనర్లు దేశంలోని ఏ ప్రాంతంలో అయినా, ఏ బ్యాంక్ నుంచయినా, ఏ శాఖ నుంచయినా తమ పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత స్వగ్రామాలకు వెళ్లి స్థిరపడిన వాళ్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు, పెన్షన్ తీసుకునే సమయానికి దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయంతో, ఇప్పుడు EPFO పెన్షనర్లు దేశంలోని ఏదైనా ప్రాంతీయ EPFO కార్యాలయం నుంచి అయినా పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
దేశంలోని మొత్తం 122 ప్రాంతీయ EPFO కార్యాలయాల్లో కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO)ను బదిలీ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉండదు. CPPS వల్ల, పింఛను విడుదలైన వెంటనే ఆ డబ్బు పెన్షనర్ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది.
కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ EPFO సేవలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పెన్షనర్లకు ఆధునిక సౌకర్యాలు అందించడంతో పాటు పారదర్శకత పెంచడంలో NDA ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు.
A Major Milestone in Modernizing EPFO!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 3, 2025
EPFO's Centralized Pension Payments System is now fully operational. This modern system ensures that pensioners can access their pensions from any bank, anywhere in India swiftly and hassle-free.
Under the leadership of PM Shri… pic.twitter.com/AvuEmxC80y
రెండు పైలెట్ ప్రాజెక్ట్‌లు విజయవంతం
CPPS మొదటి పైలట్ ప్రాజెక్ట్ 2024 అక్టోబర్‌లో జమ్ము, కర్నాల్, శ్రీనగర్ ప్రాంతీయ కార్యాలయాలలో విజయవంతంగా పూర్తయింది. ఇందులో భాగంగా, 49,000 మంది ఈపీఎస్ పెన్షనర్లకు రూ. 11 కోట్ల పింఛను పంపిణీ చేశారు. రెండో ప్రయోగాత్మక కార్యక్రమం దేశంలోని 24 ప్రాంతీయ కార్యాలయాల్లో విజయవంతంగా పూర్తయింది. ఈ 24 స్థానిక కార్యాలయాల ద్వారా 9.3 లక్షల మందికి రూ. 213 కోట్ల విలువైన పెన్షన్ అందించారు.
మరో ఆసక్తికర కథనం: మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది?, ఇలా చెక్ చేయండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
MLC Kavitha Resignation Accepted: పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!