By: ABP Desam | Updated at : 03 Aug 2021 04:06 PM (IST)
క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఆలోచిస్తున్నారా..
క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే మనం వాడే క్రెడిట్ కార్డు బెస్టేనా? మనకు థర్డ్ పార్టీ వాళ్లు కాల్ చేసి.. క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తే.. తీసేసుకుంటాం. కానీ అలా చేయడం సరైనది కాదు. మన ఉపయోగించే తీరు బట్టే కార్డు తీసుకుంటే మంచిది. క్రెడిట్ కార్డులు చాలా రకాలుంటాయి. తక్కువ ఛార్జీలతో ఎక్కువ ప్రయోజనాలుండే వాటిని ఎంపిక చేసుకోవాలి.
మన అవసరాన్ని బట్టి క్రెడిడ్ కార్టు తీసుకోవాలి. కొన్ని కార్డులు రెస్టారెంట్లలో.. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో డిస్కౌంట్ ఇస్తాయి. డిస్కౌంట్లు, ప్రయోజనాలు, రివార్డులు ఉంటాయి. కొన్ని కార్డుల్లో రివార్డు పాయింట్లు విమాన ఛార్జీగానూ మారతాయి. కొన్ని కార్డులు హోటల్ రూం బుకింగ్ కు వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్లు ఉంటే.. లాభమే కదా.. కార్డు వాడకం కూడా పెరుగుతుంది.
బిజినెస్ లో భాగంగా మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తే.. రివార్డు పాయింట్లు హోటల్ రూం బుకింగ్ ఛార్జీగా మారితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయకుంటే.. రివార్డు పాయింట్లు విమాన ఛార్జిగా మారితే.. ఏం ఉపయోగం చెప్పండి. అందుకనే ..అవసరాన్ని బట్టి కార్డు రకం, ఫీచర్లు ఉండాలి.
మనం ఖర్చు చేసేదాన్ని ప్రకారం రివార్డు పాయింట్లు ఉంటాయి. ఎక్కువగా షాపింగ్ చేసేవారికి ఈ రివార్డు పాయింట్లు ఉపయోగపడతాయి. క్యాష్ బ్యాక్ కూడా వస్తే మంచిదే కదా. మనం చేసిన చెల్లింపుల్లో ఎంతో కొంతం మనీ మన అకౌంట్ లోకి వస్తుంది. కొన్ని కార్డులు పెట్రోల్ బంకుల్లో చేసే లావాదేవీపై క్యాష్ బ్యాక్ ఇస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఉపయోగకరమే.
ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణాలు చేస్త.. ఎయిర్ పోర్టులో గంటల కొద్ది వెయిట్ చేయాల్సి వస్తుందన్న విషయం తెలిసిందే. కొన్ని కార్డులతో ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి ఫ్రీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఫుడ్ ఉండే అవకాశం ఉంది. కొన్ని కార్డులను వేరే దేశాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అక్కడి కరెన్సీ మన చేతిలో ఉండదు. మన దగ్గర ఉన్న కార్డులను వాడుకోని చెల్లింపులు చేయోచ్చు. ఇండియన్ కరెన్సీలోకి మనం చేసిన ఖర్చు మారుతుంది. కానీ.. కార్డు సంస్థలు ఎక్ఛ్సేంచ్ ఛార్జీలను వేస్తాయి. కార్డు తీసుకునే ముందు అన్నీ ఆలోచించి తీసుకోవాలి.
ఏది.. ఏమైనా క్రెడిట్ కార్డు అనేది అప్పులాంటిది అనే విషయం గుర్తుంచుకోవాలి. అవసరం కంటే ఎక్కువగా ఉపయోగించి.. సరైన టైమ్ లో బిల్లు చెల్లించకపోయినా.. ఎలాంటి లాభాలు ఉండవు. వడ్డీ కూడా ఎక్కువ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? ఇంతకీ మీ స్కోర్ ఎంత?
Health Insurance Rejection Reasons: గుండె జబ్బు చికిత్సల బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణాలివే!, ముందే అలెర్ట్ కావడం మంచిది
Gold-Silver Prices Today 03 Dec: పెరిగిన 24K, 22K పసిడి రేట్లు - ఈ రోజు బంగారం, వెండి తాజా ధరలు ఇవీ
Car Roof Rack Rules In India In Telugu : కారుపైన లగేజ్ ర్యాక్ ఏర్పాటుకూ కొన్ని రూల్స్ - కారు వయస్సును బట్టి పర్మిషన్!
Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్ - డిసెంబర్‌లో బ్యాంక్‌లు 17 రోజులు పని చేయవు
Gold-Silver Prices Today 02 Dec: భారీగా తగ్గిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu And Venkata Datta Sai Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?