By: ABP Desam | Updated at : 21 May 2022 05:14 PM (IST)
Edited By: Ramakrishna Paladi
వంటనూనె
Cooking oil prices to fall with Indonesia set to lift export ban : వంట నూనె ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు శుభవార్త! మరికొద్ది రోజుల్లో మంచినూనె ధర తగ్గే అవకాశం ఉంది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడమే ఇందుకు కారణం. మే 23 నుంచి నిషేధం ఎత్తివేత అమల్లోకి వస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధమూ ఆఖరి దశకు చేరుకోవడంతో పొద్దుతిరుగుడు నూనె ఎగుమతులూ పెరగనున్నాయి. జూన్ నెల నుంచి కస్టమర్లకు ఉపశమనం లభించనుంది.
భారత్ ప్రధానంగా పామాయిల్‌ను ఇండోనేషియా, పొద్దుతిరుగుడు నూనెను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకొనే సంగతి తెలిసిందే. ఇండోనేషియా ఏటా 46 మిలియన్ టన్నుల పామ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందులో 9 మిలియన్ టన్నులను ఆహారం, మరో 9 మిలియన్ టన్నులను బయో డీజిల్ కోసం ఉపయోగించుకుంటుంది. మిగిలిన 28 మిలియన్ టన్నులను విదేశాలకు ఎగుమతి చేస్తుంది.
'పామ్ ఆయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తేస్తామని మే19న ఇండోనేషియా ప్రకటించడంతో మార్కెట్ 5 శాతం తగ్గింది. అయితే ఎగుమతి దారులు దేశ అవసరాలను తీర్చాలని షరతు విధించడంతో మే 20న ధరలు మళ్లీ 4 శాతం పెరిగాయి' అని వంటనూనెల దిగుమతిదారు సన్‌విన్ గ్రూప్ సీఈవో సందీప్ బజోరియా అన్నారు.
దేశీయ అవసరాల కోసం 10 మిలియన్ టన్నుల పామ్ ఆయిల్‌ను రిజర్వు చేయాలని ఇండోనేషియా ప్రభుత్వం అక్కడి కుకింగ్ ఆయిల్ పరిశ్రమను ఆదేశించింది. దాంతో వేర్వేరు రకాల కుకింగ్ ఆయిల్స్ నిల్వలు క్రమంగా మెరుగవుతాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఆ దేశంలో పామ్ ఆయిల్ ఉత్పత్తి సీజన్ ఇప్పుడు మొదలై సెప్టెంబర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. సన్‌ఫ్లవర్ పరిస్థితీ మెరుగు అవుతుందని అంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలవ్వక ముందు భారత్ 200,000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను వినియోగించేది. యుద్ధం మొదలయ్యాక సరఫరా స్తంభించడంతో ఇది సగానికి తగ్గిపోయింది. 'యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటోంది. ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా నౌకలు, రైల్వేస్, రహదారి మార్గాల్లో కొద్దికొద్దిగా పెరగనుంది. దేశంలో పొద్దుతిరుగుడు నూనె సరఫరా ప్రతి నెలా 20 నుంచి 25వేల టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం' అని బజోరియా వెల్లడించారు.
Also Read: ఎన్‌ఎస్‌ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు
Also Read: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్ కోటాలో 90% బుక్!
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్- టాప్ స్కోరర్‌గా నితీశ్