By: Arun Kumar Veera | Updated at : 10 Feb 2025 10:06 AM (IST)
TDS వివరాలతో టాక్స్‌పేయర్లకు SMS ( Image Source : Other )
TDS Alert SMS From Income Tax Deportment: ఆదాయ పన్ను విభాగం పంపుతున్న ఎస్‌ఎంఎస్‌లు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. తమ మొబైల్ ఫోన్‌కు వచ్చిన SMS చూసి కొంతమంది గందరగోళానికి గురవుతుండగా, మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఆదాయ పన్ను విభాగం అలాంటి ఎస్‌ఎంఎస్ ఎందుకు పంపిందో ప్రజలకు అర్థం కాలేదు. ఏదైనా చర్య తీసుకునే ముందు ఇది ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన హెచ్చరికా? అని మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం దీనిపై చర్చ జరుగుతోంది. నిజానికి, పని చేసినందుకు జీతం లేదా రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తులకు ఆదాయ పన్ను విభాగం SMSలు పంపింది. 2024 డిసెంబర్ వరకు మీ ఆదాయంలో ఇంత TDS (Tax Deducted at Source) అని అందులో వెల్లడించింది. అదేవిధంగా, 2024-25 సంవత్సరంలో మొత్తం ఆదాయంపై వర్తించే TDS వివరాలు కూడా ఆ SMSలో ఉన్నాయి.
పన్ను చెల్లింపుదారులకు అప్‌డేట్ ఇవ్వడమే లక్ష్యం
TDS సమాచారంతో సందేశాలను పంపడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు అప్‌డేట్ ఇవ్వడం మాత్రమే ఆదాయ పన్ను విభాగం ఉద్దేశం. "మీ TDS గురించి మీ కంపెనీ యాజమాన్యం ఈ సమాచారాన్ని మాతో పంచుకుంది" అని పన్ను చెల్లింపుదారులకు (Taxpayers) తెలియజేయాలని మాత్రమే ఐటీ డిపార్ట్‌మెంట్ కోరుకుంది. TDS వివరాలను SMS ద్వారా పంపడం వల్ల, ఆ సమాచారంలో ఏవైనా దిద్దుబాట్లు ఉంటే మీరు పూర్తి చేయొచ్చు. ఆదాయ పన్ను చట్టం నిబంధనల (Income Tax Act Rules) ప్రకారం, కంపెనీ యజమాన్యాలు ప్రతి సంవత్సరం జూన్ 15న లేదా అంతకుముంే ఫామ్ 16 (Form 16)ను జారీ చేయాలి. ఫామ్ 16 అనేది కంపెనీ యాజమాన్యాలు తమ ఉద్యోగులకు జారీ చేసే సర్టిఫికేట్. ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి (ITR Filing 2025) అవసరమైన సమాచారం ఆ డాక్యుమెంట్‌లో ఉంటుంది. ఫారం 16లో యజమాని - ఉద్యోగి మధ్య జరిగిన వివిధ లావాదేవీలు, TDS & TCS (Tax Collected at Source) వివరాలు ఉంటాయి.
మరో ఆసక్తికర కథనం: ఎల్‌ఐసీ దగ్గర కుప్పలుతెప్పలుగా 'అన్‌క్లెయిమ్డ్ మనీ' - మీ డబ్బు కూడా ఉందేమో చెక్ చేయండి
పన్ను బకాయిలను వెల్లడించడం ఉద్దేశ్యం కాదు
ఆదాయ పన్ను విభాగం పంపిన SMS గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు పన్ను బకాయి ఉన్నారని గానీ, పన్ను ఎగవేతకు పాల్పడ్డారని గానీ అందులో ఎలాంటి హెచ్చరిక ఉండదు. అది, మీకు అప్‌డేట్ ఇవ్వడానికి పంపిన సందేశం మాత్రమే. ఈ SMS అలర్ట్‌ను సర్వీస్ 2016లో ప్రారంభమైంది, దీని లక్ష్యం పన్ను చెల్లింపుదారులకు వారి మొత్తం TDS కటింగ్స్ గురించి సమాచారం ఇవ్వడం. టాక్స్ పేయర్లు, తమ ఆఫీస్ పే స్లిప్‌లను ఈ SMSలో ఇచ్చిన వివరాలతో సరిపోల్చుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Unified Pension Scheme: మరో 10 రోజుల్లో 'ఏకీకృత పింఛను పథకం' - ఇలా దరఖాస్తు చేసుకోండి
Toll Deducted Twice: టోల్ గేట్ దగ్గర రెండుసార్లు డబ్బు కట్ అయ్యిందా? - ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది
Gold-Silver Prices Today 22 Mar: రూ.90,000కు దిగొచ్చిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి