By: ABP Desam | Updated at : 25 Mar 2023 01:27 PM (IST)
Edited By: Arunmali
కొత్త ఇల్లు వర్సెస్ పాత ఇల్లు - కొనాలంటే ఏది బెటర్?
House Purchase: పండుగలు అందరూ జరుపుకుంటారు. కానీ, గృహప్రవేశం అనే పండుగను మాత్రం కొందరే జరుపుకుంటారు. ఇల్లు కొనడం అనే కలను నిజం చేసుకోవడానికి సాధారణ ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తారు. ప్రతి పైసాను సంవత్సరాల తరబడి దాస్తూ వెళతారు. కోరుకున్న మొత్తం పోగయ్యాక, సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. అయితే.. కొత్త ఇల్లు కొనాలా, లేదా పాతది కొంటే సరిపోతుందా అనే గందరగోళాన్ని ప్రజలు తరచుగా ఎదుర్కొంటారు. రెండింటికీ దేని ప్రయోజనాలు, అప్రయోజనాలు దానికున్నాయి.
సాధారణంగా, పాత ఇంటిని కొనుగోలు చేయడం లాభదాయకమైన ఒప్పందంగా మారుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, పాత ఇల్లు కొనేటపుడు ఆ ఆస్తి వయస్సు (ప్రాపర్టీ ఏజ్) నిర్ధరించుకోవాలని నిపుణులందరూ సూచనలిస్తారు. ఇంటి కోసం అడుగు ముందుకు వేసేముందే, ప్రాపర్టీ ఏజ్ అంటే ఏమిటో, ఎలా తెలుసుకోవాలో మీరు అర్ధం చేసుకోవాలి.
ఆస్తి వయస్సు అంటే ఏమిటి?
ఆస్తి వయస్సు అంటే.. ఇల్లు ఎప్పుడు కట్టారు, ఎంత పాతది, దాని జీవితకాలం ఇంకా ఎంత మిగిలి ఉంది వంటి విషయాలు తెలుసుకోవడం. సాధారణంగా, ఒక కాంక్రీట్ నిర్మాణం సగటు వయస్సు 75 నుంచి 100 సంవత్సరాలుగా పరిగణిస్తారు. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక అపార్ట్‌మెంట్ జీవిత కాలం 50-60 సంవత్సరాలు. సొంతింటి (ఇండివిడ్యువల్ హౌస్) ఆయుష్షు దీని కంటే ఎక్కువగా ఉంటుంది. అపార్‌మెంట్‌ను ఉపయోగించుకునే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇండివిడ్యువల్ హౌస్ కంటే దీని జీవితకాలం తక్కువగా ఉంటుంది.
స్ట్రక్చరల్ ఇంజినీర్ నుంచి సాయం పొందండి
ఇల్లు లేదా ఫ్లాట్ యొక్క జీవితకాలం నిర్మాణ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మెటీరియల్ నాణ్యత బాగుంటే 40-50 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇల్లు ఎంత పాతది, ఎంత బలంగా ఉందో గుర్తించడంలో స్ట్రక్చరల్ ఇంజనీర్ మీకు సాయం చేస్తాడు. నిర్మాణ నమూనా ఆధారంగా అతను తనిఖీ చేస్తాడు. నిర్మాణం కోసం ఎలాంటి మెటీరియల్ ఉపయోగించారు, ఇంట్లో ఇంకా ఎంత బలం మిగిలి ఉంది వంటి విషయాలను తెలియజేస్తాడు. అపార్ట్‌మెంట్ విషయానికొస్తే, ఆ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైందో బిల్డింగ్ ప్లాన్ చెబుతుంది.
పాత గృహాల విషయంలో మరొక ప్రయోజనం వాటి ధర చౌకగా ఉంటుంది. దీనికి కారణం వాటి వయస్సు. ఏ ఆస్తి అయినా పాతబడిన కొద్దీ (ఆ ప్రాంతంలో భూమి విలును మినహాయించి చూస్తే) దాని నిర్మాణం బలం, విలువ తగ్గుతూ వస్తాయి. పాత అపార్ట్‌మెంట్‌తో పోల్చితే, కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్‌లో కొనుగోలుదార్లు ఎక్కువ సౌకర్యాలను పొందుతారు. పాత ఫ్లాట్‌లో రీమోడలింగ్ కోసం ఖర్చు చేయాలి, కొత్త ఫ్లాట్‌కు ఈ అవసరం ఉండదు.
రుణం ఇచ్చే ముందు బ్యాంకులు తనిఖీ చేస్తాయి
ఆస్తి ఎంత పాతది?, అది ఉన్న ప్రాంతం ఏంటి?, ఎలాంటి మెటీరియల్ ఉపయోగించారు?, ఇలా అన్ని విషయాలను ప్రాపర్టీ వాల్యుయేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకులు, తాము రుణం ఇస్తున్న ఆస్తి విలువైనదేనా, లేదా అని తనిఖీ చేస్తాయి. ఇల్లు చాలా పాతదైతే, రుణం తీసుకునే ఉద్దేశాన్ని బ్యాంకు చూస్తుంది. ఆ ఇంటిని కూల్చి వేసి పునర్నిర్మించుకోవడానికి అప్పు కోరుకుంటే, అది సులువుగా అందుతుంది.
Gold-Silver Prices Today 10 Jan: గ్లోబల్గా పెరిగిన గోల్డ్ డిమాండ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
New FD Rates: ఈ 3 బ్యాంకుల్లో కొత్త సంవత్సరం నుంచి FD రేట్లు మార్పు - మీకు మరింత ఎక్కువ రాబడి
Train Ticket Rules: రైళ్లలో పిల్లలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు!, తొందరపడి టిక్కెట్ కొనకండి
Cyber Fraud: ఈ 14 సైబర్ మోసాలు గురించి తెలిస్తే మీ అకౌంట్లో డబ్బులు సేఫ్- ఎవడూ టచ్ చేయలేడు
PM Surya Ghar Yojana: సూర్య ఘర్ యోజన - సోలార్ ప్యానెళ్లు చలికాలంలో ఎలా పని చేస్తాయి, బిల్లు ఎంత వస్తుంది?
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TV Movies: మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
TTD Board Chairman : అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ
PM Modi Podcast : నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ