search
×
ABP premium story Premium

ICC World Cup Cricket 2023: టీమ్‌ ఇండియా చెబుతున్న సంపద పాఠాలు, వీటిని పాటిస్తే డబ్బులో మునిగితేలొచ్చు!

మనందరి ఆటను మార్చగల సమర్థవంతమైన సంపద నిర్వహణ ఆ పాఠం ద్వారా తెలుస్తుంది.

FOLLOW US: 
Share:

Business News in Telugu: ఎదురులేని బండిలా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది టీమ్‌ ఇండియా (team India). ఫైనల్‌ ల్యాప్‌కు చేరే దారిలో ఎదురైన ఘనాపాటీ జట్లను ఓవర్‌టేక్‌ చేసింది, ప్రత్యర్థి ప్లేయర్లకు దడ పుట్టించింది. పరిస్థితులకు తగ్గట్లు మారిపోవడం, జట్టుగా కలిసి ఆడటం, ఒక ప్లాన్‌ను ఫాలో కావడం, అడ్డంకులెదురైనా వెనకడుగు వేయకపోవడం ఇండియా విన్నింగ్‌ కార్‌కు నాలుగు చక్రల్లా పని చేశాయి. 

క్రికెట్ మ్యాచ్‌ చూస్తున్నప్పుడు, మన ఫోకస్‌ సహజంగానే స్టార్‌ ప్లేయర్ల మీద ఉంటుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, బుమ్రా, షమీ.. ఇలా ప్రతి ఒక్కరి ఆటతీరును పరిశీలిస్తాం. ఈ వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ (ICC World Cup Cricket 2023 Final Match) చేరే వరకు, ఏ ఒక్క అభిమాని అంచనాను టీమ్‌ ఇండియా వమ్ము చేయలేదు. ఇదేమీ సినిమా కాదు, ఇంతటి పటిష్ట జట్టు రాత్రికి రాత్రే తయారు కాలేదు. దీర్ఘకాలంగా సామర్థ్యాన్ని నిర్మించుకుంటూ వచ్చిన టీమిండియా, ఇప్పుడు దుర్భేద్య జట్టుగా నిలిచింది.

సేమ్‌ టీమ్‌ ఇండియాలాగే, మీ సంపద కూడా వృద్ధి చెందే మార్గం ఉంది. ఇందుకోసం క్రికెట్ గ్రౌండ్‌ నుంచి నేర్చుకోవలసిన పాఠం (Wealth Management Lesson From Cricket Ground) ఉంది. మనందరి ఆటను మార్చగల సమర్థవంతమైన సంపద నిర్వహణ ఆ పాఠం ద్వారా తెలుస్తుంది.

1) బంతిపై ఫోకస్‌: ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం ‍‌
బ్యాటింగ్‌ చేసే సమయంలో, కోహ్లీ కన్ను బంతిని మాత్రమే చూస్తుంది. అలాగే, మీ ఆర్థిక లక్ష్యాల మీదే మీ దృష్టి కూడా ఉండాలి, దాన్నుంచి ఫోకస్‌ మళ్లకూడదు. పెట్టుబడి పిచ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు, మీ ఫైనాన్షియల్‌ గోల్‌ను కచ్చితంగా నిర్ణయించుకోవాలి. రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక అవసరాల కోసం, ఇల్లు కొనడానికి, పిల్లల చదువులు/వివాహం ఇలా మీ గోల్‌ క్లియర్‌గా ఉండాలి. ఆ గోల్‌ రీచ్‌ అయ్యే వరకు, అంటే సెంచరీ చేసే వరకు పరుగుల పెట్టుబడిని ఓపిగ్గా, నాటౌట్‌గా (మధ్యలో ఆపేయకుండా) కొనసాగించాలి.

2) మ్యాచ్‌ ఫార్మాట్లు: అసెట్‌ క్లాస్‌లు 
క్రికెట్‌లో.. వన్డే, టెస్ట్ మ్యాచ్‌, టీ20 ఇలా.. ఫార్మాట్లు ఉన్నాయి. అలాగే, సంపద నిర్వహణలోనూ (wealth management) ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌, కమొడిటీస్‌ వంటి వివిధ అసెట్‌ క్లాస్‌లు ఉంటాయి. ఫార్మాట్‌ ఏదైనా గెలుపే లక్ష్యం అయినట్లు, అసెట్‌ క్లాస్‌ ఏదైనా మీ అంతిమ ఆర్థిక లక్ష్యంతో అది ముడిపడి ఉండాలి. వీటిలో.. టెస్ట్ బ్యాట్స్‌మన్‌లా సహనంతో సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడాలి. అవసరమైతే, T20 ఓపెనర్‌ తరహాలో చెలరేగి ఆటను మీ వైపు తిప్పుకోవాలి.

3) జట్టు కూర్పు: పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ 
కేవలం గొప్ప బ్యాట్స్‌మెన్ లేదా గొప్ప బౌలర్లు మాత్రమే ఉన్నంత మాత్రాన భారత్ గెలవగలదా?, సరైన బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్ల కలయికతోనే అద్భుతమైన జట్టు ఏర్పడుతుంది. మీ టీమ్‌ అనే పోర్ట్‌ఫోలియోకి కూడా స్పెషలిస్ట్ ప్లేయర్లు అవసరం. మీ పెట్టుబడులు అన్నీ అన్నీ ఒకే అసెట్‌ క్లాస్‌కు పరిమితం కాకూడదు. ఈక్విటీలు, డెట్, కమోడిటీలు, గోల్డ్‌, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను చేర్చాలి. ఈ వైవిధ్యమైన లైనప్‌ వల్ల... అండర్‌పెర్‌ఫార్మర్ల ప్రభావం తగ్గుతుంది. టీమ్‌లో ఒక ప్లేయర్‌ డకౌట్ అయినా, మరో ప్లేయర్‌ సెంచరీ చేసి జట్టును గెలిపించినట్లు... పోర్ట్‌ఫోలియోలో కూడా విభిన్నమైన అసెట్‌ క్లాస్‌ల వల్ల వృద్ధి చెందుతుంది.

4) క్రీజ్‌లో పాతుకుపోవడం: మీ స్ట్రాటెజీకి కట్టుబడి ఉండడం ‍‌
ఆటలో స్థిరత్వం లేకపోతే ఆటగాడు త్వరగా పెవిలియన్‌ బాట పట్టాల్సి వస్తుంది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా ఇది వర్తిస్తుంది. ముందుగా అనుకున్న వ్యూహానికి కట్టుబడి ఉండాలి తప్ప, ఇష్టం వచ్చినట్లు ఆడకూడదు. పెట్టుబడుల క్రీజ్‌లో మీరు ఎంత స్థిరంగా పాతుకుపోతే, రన్స్‌ రూపంలో అన్ని ప్రయోజనాలు మీ అకౌంట్‌లో చేరతాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: చాట్‌జీపీట్‌ సృష్టికర్తకు ఘోర అవమానం, అతనిపై నమ్మకం లేదంటూ ఉద్యోగం నుంచి తొలగింపు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Nov 2023 03:22 PM (IST) Tags: Business News News in Telugu wealth management cricket field cricket match

ఇవి కూడా చూడండి

SBI New Scheme: ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌తో ప్రతి ఇంట్లో లక్షాధికారి - మీ పిల్లలు, తల్లిదండ్రుల కోసం పవర్‌ఫుల్‌ పథకాలు

SBI New Scheme: ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌తో ప్రతి ఇంట్లో లక్షాధికారి - మీ పిల్లలు, తల్లిదండ్రుల కోసం పవర్‌ఫుల్‌ పథకాలు

Gold-Silver Prices Today 05 Jan: రూ.8 లక్షల దగ్గర ప్యూర్‌ గోల్డ్‌, రూ.లక్ష దగ్గర వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 05 Jan: రూ.8 లక్షల దగ్గర ప్యూర్‌ గోల్డ్‌, రూ.లక్ష దగ్గర వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Aadhaar - SIM: మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్‌ కార్డ్‌లు ఉన్నాయో తెలుసుకోండి - అనవసరంగా జైలుకు వెళ్లకండి!

Aadhaar - SIM: మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్‌ కార్డ్‌లు ఉన్నాయో తెలుసుకోండి - అనవసరంగా జైలుకు వెళ్లకండి!

Personal Loan: బెస్ట్‌ రేటుతో పర్సనల్ లోన్ ఆఫర్లు - టాప్‌-7 బ్యాంక్‌ల లిస్ట్‌ ఇదిగో

Personal Loan: బెస్ట్‌ రేటుతో పర్సనల్ లోన్ ఆఫర్లు - టాప్‌-7 బ్యాంక్‌ల లిస్ట్‌ ఇదిగో

Punjab National Bank: కస్టమర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ - డిపాజిట్లపై మరింత ఎక్కువ డబ్బు చెల్లిస్తున్న PNB

Punjab National Bank: కస్టమర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ - డిపాజిట్లపై మరింత ఎక్కువ డబ్బు చెల్లిస్తున్న PNB

టాప్ స్టోరీస్

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!

Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్

Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్

Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?

Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?

Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?

Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?