By: ABP Desam | Updated at : 05 Feb 2023 01:17 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఈపీఎఫ్ విత్‌డ్రావల్
New PF withdrawal Rule:
ఉద్యోగ భవిష్య నిధి (EPF) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు ఉపసంహరిస్తే తక్కువ పన్ను వేయనుంది. ఈ మేరకు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఓ ప్రకటన చేశారు. పాన్ (PAN) అనుసంధానం చేయని ఈపీఎఫ్ ఖాతాల నుంచి వెనక్కి తీసుకున్న డబ్బుపై టీడీసీ (TDS) రేటును తగ్గించామని పేర్కొన్నారు.
ఐదేళ్లు పూర్తవ్వకముందే పాన్ అనుసంధానం చేయని ఈపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు ఉపసంహరిస్తే 30 శాతానికి బదులు ఇకపై 20 శాతమే టీడీఎస్ అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం ఐదేళ్ల గడువు పూర్తవ్వని ఖాతాల నుంచి రూ.50వేల లోపు డబ్బు వెనక్కి తీసుకుంటే పన్నులేమీ వర్తించవు. ఒకవేళ ఇలాంటి ఖాతాల నుంచి రూ.50,000కు మించి డబ్బు వెనక్కి తీసుకుంటే గతంలో 30 శాతం టీడీఎస్ అమలు చేసేవారు. ఇప్పుడు దానిని 20 శాతానికి తగ్గించారు.
పాన్ అనుసంధానించిన ఈపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకున్న డబ్బు పన్ను ఆదాయంలో జత చేస్తారు. ఐదేళ్లు గడవని ఈపీఎఫ్ ఖాతాలకే ఈ నిబంధన వర్తిస్తుంది. 'ప్రస్తుతం పాన్ అనుసంధానించని ఈపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటే 30 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. పాన్ జత చేసిన కేసుల్లో టీడీఎస్‌ను 20 శాతానికి తగ్గిస్తున్నాం' అని బడ్జెట్ ప్రతిలో పేర్కొన్నారు.
ఒకవేళ మీరు ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు వెనక్కి తీసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగండి. పాన్ అనుసంధానించని ఖాతాల నుంచి ఏప్రిల్ 1 తర్వాత డబ్బు వెనక్కి తీసుకుంటే 30 శాతానికి బదులు 20 శాతమే పన్ను చెల్లించొచ్చు. ప్రభుత్వేతర ఉద్యోగల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను నిబంధనలనూ సవరించిన సంగతి తెలిసిందే. రూ.3 లక్షలుగా ఉన్న మినహాయింపును రూ.25 లక్షలకు పెంచారు.
పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి! (How to check EPF Balance)
గతంలో ఈపీఎఫ్ ఖాతాల్లో ఎంత మొత్తం జమైందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఖాతాలన్నీ డిజిటలైజ్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఆన్‌లైన్, మొబైల్ ద్వారా ఖాతాలో ఎంత డబ్బుందో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ లేనివారు ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఎస్‌ఎంఎస్: మీ ఈపీఎఫ్‌వో ఖాతాలో ఎంత డబ్బుందో తెలుసుకొనేందుకు సులభ మార్గం సందేశం పంపించడం. మీ ఫోన్లో EPFOHO UAN ENG అని 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి.
మిస్డ్ కాల్: నమోదిత సభ్యులు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఖాతాలోని మొత్తం తెలుసుకోవచ్చు. ఒకసారి మిస్‌డ్ కాల్ ఇవ్వగానే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో ఒక సందేశం వస్తుంది.
వెబ్‌సైట్: నేరుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు. ఓటీపీ ద్వారా ఈ యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు. యాప్‌లోకి వెళ్లాక ఈపీఎఫ్‌వోపై క్లిక్ చేస్తే చాలు. ఉద్యోగి సేవలకు తీసుకెళ్తుంది. అక్కడ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. దానిని ఎంటర్ చేస్తే ఖాతాలోని మొత్తం వివరాలు కనిపిస్తాయి.
Gold-Silver Price 28 March 2023: కొద్దికొద్దిగా కొండ దిగుతున్న పసిడి, మళ్లీ ₹60 వేల దిగువకు రేటు
Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్ బెటర్!
Small Savings Schemes: మీకో గుడ్‌న్యూస్ - PPF, SSY వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్!
Housing Sales: ఖరీదైన ఇళ్లే కావాలంటున్న జనం, ప్రీమియం గృహాలకు పెరిగిన డిమాండ్
EPFO Alert: నేడే ఈపీఎఫ్‌వో బోర్డ్ మీటింగ్ - వడ్డీరేటు ఇంకా తగ్గిస్తారా ఏంటీ?
Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్