By: ABP Desam | Updated at : 19 Feb 2023 08:29 AM (IST)
Edited By: Arunmali
పోస్టాఫీస్ ప్రీమియం అకౌంట్
Post Office Premium Savings Account: చిన్న మొత్తాల పొదుపు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేసి పోస్ట్ ఆఫీసే. బ్యాంక్ శాఖలు లేని ప్రాంతాల్లోనూ తపాలా కార్యాలయాలు పని చేస్తుంటాయి. అందుకే, బ్యాంక్‌ల వద్ద కంటే పోస్ట్ ఆఫీసుల్లోనే పొదుపు ఖాతాల సంఖ్య ఎక్కువ.
చిన్న మొత్తాల పొదుపు పథకం కింద, పోస్ట్ ఆఫీసులు/ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (India Post Payments Bank - IPPB) ప్రజలకు చాలా పెట్టుబడి ఆప్షన్లను అందిస్తున్నాయి. వాటిలో, సీనియర్ సిటిజన్ల దగ్గర నుంచి చిన్న పిల్లల కోసం వరకు బోలెడన్ని పథకాలు ఉన్నాయి. భారత పౌరులు ఎవరైనా ఈ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాల కింద భారత పౌరులు అందరికీ సమాన అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తారు.
ఇప్పుడు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ప్రీమియం సేవింగ్స్ అకౌంట్ (Premium Saving Account) అందుబాటులోకి వచ్చింది. దీని కింద ఖాతాదారులకు ఎక్కువ సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. క్యాష్ బ్యాక్, రుణం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ వంటి చాలా సదుపాయాలు ఖాతాదారులకు అందుతాయి. ఈ ఖాతాను ఎలా తెరవాలో, దాని ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ ప్రీమియం సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలు
పోస్ ఆఫీస్ ప్రీమియం సేవింగ్స్ ఖాతాలోని ప్రధాన సౌకర్యం ఏమిటంటే... అపరిమిత డబ్బును మీరు డిపాజిట్ చేయవచ్చు & విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో, బ్యాంకుల తరహాలోనే ఈ ఖాతా కింద డోర్ స్టెప్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ఖాతా కింద రుణం కూడా తీసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ లోన్ పేరిట అప్పు ఇస్తారు. అదే విధంగా, మీరు ఈ ఖాతా నుంచి ఏ విధమైన బిల్లులు చెల్లించినా క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ రూపంలో నిర్దిష్ట మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలో క్రెడిట్ చేస్తారు. దీంతో పాటు... భౌతిక & వర్చువల్ డెబిట్ కార్డ్ (Virtual Debit Card) కూడా జారీ చేస్తారు. ఈ ఖాతాకు కనీస నగదు నిల్వ (Minimum cash balance) పరిమితి లేదు.
ప్రీమియం సేవింగ్స్ ఖాతా ఎవరి కోసం?
10 సంవత్సరాల వయస్సు దాటిన వారంతా ఈ ఖాతాను తెరవడానికి అర్హులే. అయితే, దీని కోసం KYC (Know Your Customer) పూర్తి చేయడం తప్పనిసరి. KYC చేయకపోతే పోస్ట్ ఆఫీస్ ప్రీమియం సేవింగ్స్ ఖాతా సదుపాయాన్ని పొందలేరు.
ఈ ఖాతాను ఆన్‌లైన్ ద్వారా ఓపెన్ చేయడం కుదరదు. పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా, లేదా గ్రామీణ్ డాక్ సేవక్ ద్వారా మీరు ఈ ఖాతాను తెరవవచ్చు.
ఖాతా తెరవడానికి ఎంత ఖర్చవుతుంది?
పోస్ట్ ఆఫీస్ ప్రీమియం ఖాతాను తెరవాలంటే, మొదట మీరు రూ. 149తో పాటు GST చెల్లించాలి. తర్వాత ఖాతాలో ఓపెనింగ్ బ్యాలెన్స్ కోసం రూ. 200 చెల్లించాలి. మినిమమ్ క్యాష్ బ్యాలెన్స్ పరిమితి లేదు కాబట్టి, ఈ రూ. 200ను తర్వాత మీకు అవసరమైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే, ఖాతా పునరుద్ధరణ కోసం ఏటా రూ. 99 + జీఎస్టీ చెల్లించాలి.
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్
Gold-Silver Prices Today 27 Dec: రూ.600 పెరిగిన ప్యూర్ గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24K, 22K పసిడి ధరలు ఇవీ
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్ స్కీమ్ స్టార్టెడ్
New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!
Gold-Silver Prices Today 26 Dec: ఈ రోజు 24K, 22K గోల్డ్ రేట్లలో మార్పులు - తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు