By: ABP Desam | Updated at : 08 Sep 2023 11:05 AM (IST)
ఆధార్ వివరాలను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం
Aadhaar Card Updation News: దేశంలో ఆధార్ కార్డులను జారీ చేసే అధీకృత సంస్థ ఉడాయ్ (UIDAI) మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే చివరి తేదీని రెండోసారి కూడా పెంచింది. వాస్తవానికి ఈ లాస్ట్ డేట్ ఈ ఏడాది జూన్ 14తోనే ముగిసినా, ఉడాయ్ ఆ గడువును మరో మూడు నెలల వరకు పెంచి, ఫ్రీ ఆఫర్‌ను సెప్టెంబరు 14వ తేదీ వరకు అందుబాటులోకి ఉంచింది. ఇప్పుడు, ఈ తేదీని కూడా ఇంకో మూడు నెలలు పెంచి డిసెంబర్ 14 వరకు పొడిగించింది.
మీ ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, మీ అడ్రస్ మారినా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవడానికి 14 డిసెంబర్ 2023 (Aadhar free updation last date) వరకు సమయం ఉంది. UIDAI వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్ కార్డ్‌లో కచ్చితమైన సమాచారం ఉండేలా ప్రతి ఆధార్ కార్డ్ హోల్డర్ చూసుకోవాలి. ఆధార్ డిటైల్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే, తగిన ఫ్రూఫ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి వివరాలు అప్‌డేట్ చేయాలి.
https://myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఉడాయ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఆధార్ కార్డ్‌ను 'ఫ్రీ'గా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చు. దీని కోసం, ఆధార్ నంబర్, లింక్‌డ్ మొబైల్ ఫోన్‌ను దగ్గర పెట్టుకోవాలి. పోర్టల్‌లో ఆధార్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత, మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా మీ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
ఆఫ్‌లైన్/ఆధార్ కేంద్రం/CSC కి వెళ్లి ఆధార్ సమాచారం అప్‌డేట్ చేయాలనుకుంటే మాత్రం 25 రూపాయలు ఛార్జీ చెల్లించాలి.
ఆధార్ కార్డ్ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి?
ముందుగా myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ చేయండి
మీ పేరు/లింగం/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్లు ఎంచుకోండి
ఆధార్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోండి
ఇప్పుడు చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి ఉన్న ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్ కాపీని అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను అప్‌లోడ్ చేయండి
ఇప్పుడు మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ (URN) వస్తుంది
ఆ నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఆధార్ అప్‌డేషన్ స్టేటస్ తనిఖీ చేయడానికి ఆ నంబర్ ఉపయోగపడుతుంది
ఆధార్ అప్‌డేషన్ ప్రాసెస్‌ను ఎలా ట్రాక్ చేయాలి?
మీ ఆధార్ కార్డ్‌లో మార్పు కోసం మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత, మీకు URN నంబర్ వస్తుంది. అది మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా అందుతుంది. మీరు https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ వివరాల అప్‌డేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు.
డెమోగ్రాఫిక్ డేటాను ఎప్పుడు అప్‌డేట్ చేయాలి?
మన దేశంలో వివాహానంతరం మహిళ ఇంటి పేరు మారుతుంది. ఇలాంటి సందర్భంలో మార్పులు చేయాలి. అయితే, ఒక మహిళ ఉద్యోగం చేస్తున్నా/చేయాలని అనుకుంటున్నా... విద్యార్హత పత్రాల్లో ఉన్న ఇంటి పేరు ప్రకారమే ఉద్యోగ నియామకం జరుగుతుంది కాబట్టి, ఆమె ఆధార్ కార్డ్‌లో పుట్టింటి పేరునే కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఇప్పటికే భర్త ఇంటి పేరుతో మార్చుకున్నా, పదో తరగతి సర్టిఫికెట్‌ను ప్రూఫ్‌గా చూపి, పుట్టింటి ఇంటి పేరుకు మళ్లీ మారవచ్చు. పుట్టిన తేదీ, పేరు, చిరునామాలో తప్పులు దొర్లినా మీ ఆధార్ డిటెయిల్స్ అప్‌డేట్ చేయాలి.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Cashback Credit Cards: ఆన్‌లైన్ షాపింగ్‌పై బంపర్ డిస్కౌంట్ - ఈ క్రెడిట్ కార్డ్స్‌తో అద్భుతమైన క్యాష్‌బ్యాక్స్
Gold-Silver Prices Today 28 Dec: భలే ఛాన్స్, రూ.1600 తగ్గిన బంగారం ధర - మీ ప్రాంతంలో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవీ
Investment Tips: ఈ పొదుపు పథకాలకు దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ - పెట్టుబడిపై 8 శాతం పైగా రాబడి
CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్ లోన్ తీసుకోలేదు' - నా సిబిల్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన