By: ABP Desam | Updated at : 30 Aug 2023 03:02 PM (IST)
మీ ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసే గడువు దగ్గర పడింది
Aadhaar Card Updation News: ఆధార్ కార్డును పూర్తి ఉచితంగా అప్‌డేట్ చేసుకునే చివరి తేదీ దగ్గర పడింది. వాస్తవానికి ఈ లాస్ట్ డేట్ ఈ ఏడాది జూన్ 14తోనే ముగిసినా, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ (UIDAI) ఆ గడువును మరో మూడు నెలల వరకు పెంచింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు 14వ తేదీ వరకు "ఫ్రీ ఆఫర్" అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆ తేదీ కూడా దగ్గర పడుతోంది. మీ ఆధార్ కార్డ్‌లోని మీ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, మీ అడ్రస్ మారినా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవడానికి మరికొన్ని రోజుల (14 సెప్టెంబర్ 2023 వరకు) సమయం మాత్రమే ఉంది.
UIDAI వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్ కార్డ్‌లో కచ్చితమైన సమాచారం ఉండేలా ప్రతి ఆధార్ కార్డ్ హోల్డర్ చూసుకోవాలి. ఇందుకోసం, తగిన ఫ్రూఫ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, ఆధార్ కార్డ్ డిటైల్స్ అప్‌డేట్ చేయాలి. మీ ఆధార్ కార్డ్‌ను 'ఫ్రీ'గా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి, https://myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఉడాయ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు. ఆఫ్‌లైన్/ఆధార్ కేంద్రం/CSC కి వెళ్లి ఆధార్ సమాచారం అప్‌డేట్ చేయాలనుకుంటే మాత్రం రూ. 25 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
UIDAI పోర్టల్ ద్వారా, ఆన్‌లైన్ పద్ధతిలో, మీ ఇంటి చిరునామా, మీ పేరు మొదలైన సమాచారాన్ని ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయవచ్చు/తప్పులు సరిచేసుకోవచ్చు. దీని కోసం వినియోగదార్లు తమ ఆధార్ నంబర్, లింక్‌డ్ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా మీ చిరునామా సహా ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఆధార్ కార్డ్ వివరాలను 'ఫ్రీ'గా ఎలా అప్‌డేట్ చేయాలి?
ముందుగా myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ చేయండి
మీ పేరు/లింగం/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్లు ఎంచుకోండి
ఆధార్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోండి
ఇప్పుడు చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి ఉన్న ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్ కాపీని అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను అప్‌లోడ్ చేయండి
ఇప్పుడు మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ (URN) వస్తుంది
ఆ నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఆధార్ అప్‌డేషన్ స్టేటస్ తనిఖీ చేయడానికి ఆ నంబర్ ఉపయోగపడుతుంది
ఆధార్ అప్‌డేషన్ ప్రాసెస్‌ను ఎలా ట్రాక్ చేయాలి?
మీ ఆధార్ కార్డ్‌లో మార్పు కోసం మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత, మీకు URN నంబర్ వస్తుంది. అది మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా అందుతుంది. మీరు https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ వివరాల అప్‌డేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు.
డెమోగ్రాఫిక్ డేటాను ఎప్పుడు అప్‌డేట్ చేయాలి?
మన దేశంలో వివాహానంతరం మహిళ ఇంటి పేరు మారుతుంది. ఇలాంటి సందర్భంలో మార్పులు చేయాలి. అయితే, ఒక మహిళ ఉద్యోగం చేస్తున్నా/చేయాలని అనుకుంటున్నా... విద్యార్హత పత్రాల్లో ఉన్న ఇంటి పేరు ప్రకారమే ఉద్యోగ నియామకం జరుగుతుంది కాబట్టి, ఆమె ఆధార్ కార్డ్‌లో పుట్టింటి పేరునే కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఇప్పటికే భర్త ఇంటి పేరుతో మార్చుకున్నా, పదో తరగతి సర్టిఫికెట్‌ను ప్రూఫ్‌గా చూపి, పుట్టింటి ఇంటి పేరుకు మళ్లీ మారవచ్చు. పుట్టిన తేదీ, పేరు, చిరునామాలో తప్పులు దొర్లినా మీ ఆధార్ డిటెయిల్స్ అప్‌డేట్ చేయాలి.
మరో ఆసక్తికర కథనం: ₹200 తగ్గిన తర్వాత, తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ కొత్త రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే
Nandyal News: కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!