By: Arun Kumar Veera | Updated at : 28 Jan 2025 11:44 AM (IST)
దేశంలో క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య రెట్టింపు ( Image Source : Other )
Credit Cards Issued In India: దేశంలో క్రెడిట్ కార్డ్‌లపై ప్రజలు ఎడతెగని ప్రేమ కురిపిస్తున్నారు, వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ రెగ్యులేటర్ 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2019 డిసెంబర్ నుంచి, ఐదేళ్లలో క్రెడిట్ కార్డుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. విచిత్రం ఏంటంటే, ఈ కాలంలో డెబిట్ కార్డ్‌ల సంఖ్య దాదాపు స్థిరంగా ఉంది. డెబిట్ కార్డ్‌లపై ప్రజల అనాసక్తికి ఇది నిదర్శనం.
2024 డిసెంబర్ లెక్క
రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం, గత ఏడాది (2024) డిసెంబర్ నెలలో ఏకంగా 8,20,000 కొత్త క్రెడిట్ కార్డులను బ్యాంక్‌లు జారీ చేశాయి, ఇది ఒక రికార్డ్. దీనికి ముందు నెల, అంటే 2024 నవంబర్‌లో 3.50 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు ప్రజల చేతుల్లోకి వచ్చాయి. ఈ సంఖ్య డిసెంబర్‌లో రెట్టింపు పైగా పెరిగింది. ప్రజల నుంచి డిమాండ్‌తో పాటు బ్యాంక్‌లు కూడా పోటీ పడి కార్డ్‌లు జారీ చేయడం దీనికి కారణం.
ఎప్పటిలాగే, కొత్త క్రెడిట్ కార్డ్‌ల జారీ లిస్ట్‌లో HDFC బ్యాంక్ టాప్ ప్లేస్‌లో ఉంది. SBI కార్ట్స్ రెండో స్థానంలో ఉంది. 2024 డిసెంబర్‌లో, HDFC బ్యాంక్ 3,12,00 కార్డులను ఇష్యూ చేసింది, అదే కాలంలో SBI కార్డ్స్ 2,09,000 కార్డులు, ICICI బ్యాంక్ 1,50,000 కార్డులను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, ఖర్చులకు ఆసరాగా ఉంటుందన్న కారణంతో ఎక్కువ మంది కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా ప్రజలు చేసిన ఖర్చు (Credit card outstanding) 2024 డిసెంబర్‌లో 11 శాతం పెరిగి రూ. 1.9 లక్షల కోట్లకు చేరింది.
ఐదేళ్ల లెక్కలు
2019 డిసెంబర్‌తో పోలిస్తే, 2024 డిసెంబర్ చివరి నాటికి, క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య రెండింతలు పెరిగి దాదాపు 10.80 కోట్లకు చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. డిసెంబర్ 2019లో 5.53 కోట్ల క్రెడిట్ కార్డులు చెలామణిలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, డెబిట్ కార్డ్‌ల సంఖ్య పెద్దగా మారలేదు. 2019 డిసెంబర్‌లోని 80.53 కోట్ల నుంచి కొద్దిగా పెరిగి 2024 డిసెంబర్ నాటికి 99.09 కోట్లకు (Debit Cards Issued In India) చేరాయి.
గత దశాబ్ద కాలంలో, భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరిగాయి. 2013 క్యాలెండర్ సంవత్సరంలో రూ. 772 లక్షల కోట్ల విలువైన 222 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇది, 2024 నాటికి 94 రెట్లు పెరిగి 20,787 కోట్ల లావాదేవీలకు & 3.5 రెట్ల విలువతో రూ. 2,758 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ఇతర దేశాలతో వేగవంతమైన చెల్లింపు వ్యవస్థను ప్రోత్సహించడానికి, UPIని లింక్ చేయడం ద్వారా క్రాస్ బోర్డర్ పేమెంట్స్‌ను వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు RBI తన నివేదికలో పేర్కొంది. ఇటువంటి అనుసంధానం ద్వారా.. అధిక ధర, తక్కువ వేగం, పరిమిత యాక్సెస్, క్రాస్ బోర్డర్ చెల్లింపుల్లో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చని వివరించింది.
మరో ఆసక్తికర కథనం: ఎన్ని సంవత్సరాలు పని చేస్తే గ్రాట్యుటీ లభిస్తుంది, కార్మిక చట్టం రూల్స్ ఏంటి?
Stock Market Crash: ప్రెజర్ కుక్కర్‌లో స్టాక్ మార్కెట్, మూడో రోజూ అమ్మకాల జోరు - 23000 దిగువకు నిఫ్టీ పతనం
Gold-Silver Prices Today 12 Feb: ఎట్టకేలకు తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
New Income Tax Bill: గురువారం లోక్‌సభలోకి కొత్త ఆదాయ పన్ను బిల్లు! - చట్టం వచ్చాక మారే విషయాలు ఇవీ
ITR Filing: ఆదాయం పెరిగింది, ఐటీఆర్‌లు పెరిగాయ్ - టాక్స్‌పేయర్ల సంఖ్య తగ్గింది, ఇదేం విచిత్రం
SIP Risk: సిప్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, రిస్క్ పెంచొచ్చు - ఆలోచించి అడుగేయండి
Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
Actor Prudhvi: నా తల్లి బతికున్నప్పుడు తిడితే నరికేవాడిని... ఆస్పత్రి బెడ్ నుంచి పృథ్వీ ఇంటర్వ్యూ - వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్
Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం