By: ABP Desam | Updated at : 07 Jan 2023 01:10 PM (IST)
Edited By: Ramakrishna Paladi
హౌజ్ రెంట్ అలవెన్స్,
7th Pay Commission:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! ఆర్థిక మంత్రిత్వ శాఖ హౌజ్ రెంట్ అలవెన్స్ (HRA) నిబంధనలు సవరించింది. ఖర్చుల శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కొన్ని సందర్భాల్లో కేంద్ర ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు. చట్ట ప్రకారం ఉద్యోగుల వేతనంలోనే హెచ్‌ఆర్‌ఏ కలిసే సంగతి తెలిసిందే.
ఎలాంటి సందర్భాల్లో ఇవ్వరంటే!
1) మరో ఉద్యోగికి కేటాయించిన నివాస సముదాయంలోనే కలిసి ఉంటే హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు.
2) కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్వయం ప్రతిపత్తిగల ప్రభుత్వ కంపనీ, సెమీ గవర్నమెంట్ సంస్థలు, మున్సిపాలిటీ, పోర్ట్ ట్రస్టు, జాతీయ బ్యాంకులు, ఎల్‌ఐసీ తమ తల్లిదండ్రులు, కుమారుడు, కూతురుకి కేటాయించిన నివాసంలో ఉంటే హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు.
3) ఒకే ప్రాంతంలో ఉద్యోగి జీవిత భాగస్వామికి పైన చెప్పిన సంస్థలు నివాస సదుపాయాన్ని కల్పిస్తే, ఉద్యోగి అందులో నివసించినా లేదా ప్రత్యేకంగా అద్దెకు ఉన్నా హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు.
హౌజ్ రెంట్ అలవెన్స్ నిబంధనలు
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఉద్యోగుల నివాస ఖర్చులను హెచ్‌ఆర్‌ఏ రూపంలో వేతనంలో కలిపి ఇస్తాయి. దీనిని X, Y, Z విభాగాల్లో అందిస్తారు.
అ) 50 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలు 'X' కేటగిరీలోకి వస్తాయి. ఏడో వేతన కమిషన్ సూచనల మేరకు వీరికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
ఆ) 5-50 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలు 'Y' కేటగిరీలోకి వస్తాయి. ఏడో వేతన కమిషన్ నిబంధనల ప్రకారం వీరికి 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
ఇ) ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు 'Z' కేటగిరీలోకి వస్తాయి. ఏడో వేతన కమిషన్ సూచనల ప్రకారం వీరికి 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
Also Read: రెండు రోజుల్లో రూ.53,000 కోట్లు పోగొట్టిన బజాజ్ ట్విన్స్, మొసళ్ల పండుగ ఇంకా ఉందా?
Also Read: వీడియో KYC ద్వారా ఎన్‌పీఎస్ డెత్ క్లెయిమ్, ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగొద్దు
సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి!
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!