By: ABP Desam | Updated at : 23 Sep 2022 07:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఏడో వేతన కమిషన్
7th Pay Commission: గుడ్‌న్యూస్! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల నిబంధనలను మోదీ సర్కారు సవరించింది. 7th పే మ్యాట్రిక్స్, పే లెవల్స్‌ను అనుసరించి ఇకపై పదోన్నతులు కల్పించనుంది. ఉన్నత పదవులు అధిరోహించేందుకు అవసరమైన కనీస సేవల కాలాన్ని మూడేళ్లకు తగ్గించింది. ఈ మేరకు 2022, సెప్టెంబర్ 20 తేదీతో ఆఫీస్ మెమోరాండాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) జారీ చేసింది.
డీఓపీటీ 23.3.2009 తేదీతో జారీ చేసిన నిబంధనలను కేంద్ర సమీక్షించింది. యూపీఎస్‌సీ, ఇతర కాంపిటెంట్ అథారిటీ సంస్థలను సంప్రదించి సవరణను ఆమోదించింది. ఏడో సీపీసీ పే మ్యాట్రిక్స్, పే లెవల్స్‌ను బట్టి పదోన్నతి పొందేందుకు అవసరమైన కనీస సేవా కాలాన్ని మూడేళ్లకు తగ్గించింది. ఈ సవరణతో నియామక నిబంధనలు, సర్వీస్ నిబంధనల్లో మార్పు రానుంది. ఇకపై నియామకాలు చేపట్టేటప్పుడు సవరించిన నిబంధనలు పాటించాలని అన్ని మినిస్ట్రీస్, డిపార్టుమెంట్లను డీఓపీటీ కోరింది.
అతి త్వరలో డీఏ పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అతి త్వరలోనే డీఏ పెంచనుంది. ఏడో వేతన కమిషన్ ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ (DA), పింఛన్‌దారులకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) ప్రకటించనుందని తెలిసింది. ఇప్పటికైతే అధికారికంగా చెప్పలేదు గానీ సెప్టెంబర్ చివరి వారంలో ప్రకటిస్తారని సమాచారం.
ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్లో మరో 4 శాతం పెంచి మొత్తం 38 శాతానికి చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. అందులో చర్చించాక డీఏ రేటును ప్రకటిస్తారు.
DA ఎందుకిస్తారంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏను చెల్లిస్తుంది. ఇది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తిస్తుంది. ఏడో వేతన కమిషన్ (7th Pay Commission) ప్రకారం డీఏను ఏటా రెండుసార్లు పెంచుతారు. జనవరి, జులైలో వీటిని అమలు చేస్తారు. ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టీ డీఏ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. రూరల్, సెమీ అర్బన్‌తో పోలిస్తే అర్బన్ ఉద్యోగులకు ఎక్కువ డీఏ వస్తుంది.
ఎంత జీతం పెరుగుతుంది?
ఇప్పుడు బేసిక్ సాలరీలో డీఏ 34 శాతంగా ఉంది. 4 శాతం పెంచితే 38 శాతానికి చేరుతుంది. ఒక వ్యక్తికి రూ.35,000 బేసిక్ సాలరీ అయితే రూ.11,900 డీఏ ఉంటుంది. సవరించే నాలుగు శాతం కలిపితే డీఏ రూ.13,300కు పెరుగుతుంది. అంటే నెలకు రూ.1400 వరకు అదనంగా వస్తుందని అంచనా. ఈ పెరిగిన డీఏతో ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగులపై తగ్గుతుందన్నమాట.
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం