By: ABP Desam | Updated at : 11 Jan 2023 10:56 AM (IST)
Edited By: Arunmali
వడ్డీ రేట్లు పెంచిన నాలుగు బ్యాంకులు
Banks Hikes Interest rates: దేశంలో వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ గాడిన పడడంతో, బడా కంపెనీలు లోన్ల కోసం బ్యాంకుల గడప తొక్కుతున్నాయి. వాటికి లోన్లు ఇవ్వడానికి, ప్రజల దగ్గర నుంచి స్వీకరించే కాల పరిమితి డిపాజిట్లు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లను (Fixed Deposits) బ్యాంకులు పెంచుకోవాలి. ఇందుకోసం, ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను ఇటీవలి కాలంలో అన్ని బ్యాంకులు పెంచాయి. డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచడం బ్యాంకులకు అదనపు భారం కాబట్టి, ఆ భారాన్ని రుణాల మీదకు బదిలీ చేస్తున్నాయి. అంటే, తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచి, తమ మీద భారాన్ని బ్యాంకులు తగ్గించుకుంటున్నాయి. అప్పులు తీసుకునే వాళ్ల మీదకు దానిని నెట్టేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో... చాలా బ్యాంకులు ఉపాంత నిధుల వ్యయ ఆధారిత రుణాల (MCLR) మీద వడ్డీ రేట్లను పెంచాయి. కొత్తగా తీసుకునే రుణాలతో పాటు, గతంలో తీసుకుని క్రమపద్ధతిలో (Loan EMI) తిరిగి చెల్లిస్తున్న రుణాల మీద కూడా కొత్త రేటు ప్రకారం ఛార్జీలు పెరుగుతాయి.
కొత్తగా నాలుగు బ్యాంకులు రుణాల మీద వడ్డీ రేట్లు పెంచాయి. అవి.. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank), బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India).
బ్యాంక్ ఆఫ్ బరోడా, తన MCLRను 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35% పెంచాలని నిర్ణయించింది. ఈ వడ్డీ రేట్ల పెంపుదల నేటి (జనవరి 11, 2023) నుంచి అమలులోకి వచ్చింది. ఏడాది కాల పరిమితితో ఇచ్చే రుణాల మీద ఎంసీఎల్‌ఆర్‌ను 8.30 శాతం నుంచి 8.50 శాతానికి పెంచింది. ఓవర్‌నైట్ (ఒక్కరోజు) ఎంసీఎల్‌ఆర్‌ను 7.5 శాతం నుంచి 7.85 శాతానికి తీసుకెళ్లింది. ఒక నెల రేటును 7.95 శాతం నుంచి 8.15 శాతానికి, 3 నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.06 శాతం నుంచి 8.15 శాతానికి, 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.25 శాతం నుంచి 8.35 శాతానికి పెంచింది. అంటే, ఈ బ్యాంక్ ఈ రేట్ల కంటే తక్కువకు రుణాలు ఇవ్వదు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన MCLRను 25 బేసిస్ పాయింట్లు లేదా 0.25% పెంచింది. మంగళవారం (జనవరి 10, 2023) నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. కొత్త రేట్లు 7.50-8.15 శాతం పరిధిలో ఉంటాయి. 6 నెలల కాల పరిమితి రుణాల మీద వడ్డీ 8.05 శాతానికి, ఏడాది రుణాల మీద వడ్డీ 8.15 శాతానికి చేరింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, తన టర్మ్ డిపాజిట్ల మీద 45 బేసిస్ పాయింట్లు లేదా 0.45% వడ్డీని పెంచింది. దేశీయ, NRO, NRE డిపాజిట్ల మీద 444 రోజులకు 7.75 శాతం వడ్డీ అందిస్తోంది. విదేశీ నగదు డిపాజిట్ల మీద వడ్డీని 1 శాతం మేర పెంచింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ల మీద 444 రోజుల కాలానికి వడ్డీ రేటును జనవరి 10, 2023 నుంచి పెంచింది. సాధారణ పౌరులకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 2-5 సంవత్సరాల డిపాజిట్ల మీద 7.25 శాతం వడ్డీని ప్రకటించింది.
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Yanam Jesus statue: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీసస్ స్టాట్యూను చూశారా..?