By: Arun Kumar Veera | Updated at : 18 Feb 2024 11:07 AM (IST)
రోజుకు ₹100తో నెలకు ₹57,000 పెన్షన్
Popular Pension Plan In India: ప్రతి ఒక్కరు, తమకు స్థిరమైన ఆదాయం (ఉద్యోగం, వ్యాపారం) ఉన్నప్పుడే రిటైర్మెంట్ జీవితం గురించి కూడా పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాలి. బంగారం, స్థిరాస్తి, షేర్ మార్కెట్, ప్రభుత్వ పథకాలు.. ఇలా చాలా రూపాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు, సంపద పెంచుకోవచ్చు. ప్రభుత్వం రన్ చేస్తున్న పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం కూడా తెలివైన నిర్ణయంగా నిలుస్తుంది. దీనివల్ల, పెట్టుబడికి నష్ట భయం ఉండదు + ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బెస్ట్ ప్లాన్స్‌లో ఒకటి... 'జాతీయ పింఛను పథకం' లేదా 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (NPS).
భారత ప్రభుత్వం, తక్కువ ఆదాయ వర్గాల కోసమే NPSను (National Pension System) తీర్చిదిద్దింది. అంటే, ఇంటి బడ్జెట్ మీద భారం లేకుండానే, చాలా తక్కువ మొత్తంతో ఇందులో పెట్టుబడిని ప్రారంభించొచ్చు. చందాదారుకు 60 సంవత్సరాలు రాగానే, అప్పటి వరకు NPS ఖాతాలో ఉన్న మెచ్యూరిటీ మొత్తం రూ. 5 లక్షలు లేదా ఆ లోపు ఉంటే, ఆ మొత్తం డబ్బును ఒకేసారి వెనక్కు తీసుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్ నాటికి కార్పస్ రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ఆ మొత్తంలో గరిష్టంగా 60% డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. మీరు కావాలనుకుంటే 100% కార్పస్‌తోనూ యాన్యుటీ ప్లాన్ తీసుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బు తిరిగి వస్తుంది.
ఈ స్కీమ్ కింద, తక్కువ డబ్బును ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. రోజుకు కేవలం రూ. 100 ఆదా చేసి నెలకు రూ. 57,000 పెన్షన్ కూడా తీసుకోవచ్చు.
నెలకు ₹1500 పెట్టుబడితో ₹57 లక్షలు
మీరు, మీ 25 సంవత్సరాల వయస్సులో, NPSలో నెలకు రూ.1500 (రోజుకు 50 రూపాయలు) పెట్టుబడి పెడితే, 60 ఏళ్ల వయస్సులో మొత్తం కార్పస్ రూ. 57,42,416 అవుతుంది. ఉజ్జాయింపుగా, వార్షిక వడ్డీ 10 శాతం లెక్కన ఈ సంపద పోగుపడుతుంది.
మీ అకౌంట్‌లో జమ అయిన మొత్తం డబ్బుతో (100% కార్పస్) యాన్యుటీ ప్లాన్ కొంటే, నెలకు రూ. 28,712 పెన్షన్ తీసుకోవచ్చు. 40% మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేస్తే, నెలవారీ పెన్షన్ రూ. 11,485 అవుతుంది. ఇంకా మీ అకౌంట్‌లో రూ. 34 లక్షలు ఉంటాయి, వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.
రోజుకు ₹100తో నెలకు ₹57,000 పెన్షన్
మీరు 25 సంవత్సరాల వయస్సు నుంచి ప్రతి రోజు 100 రూపాయలు (నెలకు రూ. 3,000) పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, NPS కాలిక్యులేటర్ ప్రకారం, మీకు 60 సంవత్సరాల వచ్చే సరికి ఒక కోటి 14 లక్షల 84 వేల 831 రూపాయలు (రూ. 1,14,84,831) జమ అవుతుంది. ఈ మొత్తంతో 100% యాన్యుటీ కొనుగోలు చేస్తే, మొత్తం నెలవారీ పెన్షన్ రూ. 57,412 వస్తుంది. 40% మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేస్తే నెలకు రూ. 22,970 పెన్షన్ వస్తుంది. మిలిగిన 60% కార్పస్ రూ. 68 లక్షలను ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
NPS సబ్‌స్క్రైబర్లు, తమ పెట్టుబడిపై ఆదాయ పన్ను (Income tax saving) చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షలు, సెక్షన్ 80CCD కింద (టైర్-1 అకౌంట్) మరో రూ.50,000 కలిపి, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఫామ్-16 అంటే ఏంటి, ఐటీ రిటర్న్ ఫైలింగ్‌లో దాని పాత్రేంటి?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్