By: Arun Kumar Veera | Updated at : 18 Feb 2024 09:33 AM (IST)
ఫామ్-16 అంటే ఏంటి, ఐటీ రిటర్న్ ఫైలింగ్‌లో దాని పాత్రేంటి?
Income Tax Return Filing 2024 - Form-16: 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ సీజన్ అతి సమీపంలో ఉంది. రిటర్న్ ఫైలింగ్ కోసం అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఫామ్-16 జారీ చేస్తాయి. జీతం రూపంలో ఆదాయం పొందే పన్ను చెల్లింపుదార్లకు ఇది చాలా కీలక డాక్యుమెంట్. ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫైల్ (ITR Filing) చేసే సమయంలో ఫామ్-16 బాగా ఉపయోగపడుతుంది, అసెసీ పనిని సులభం చేస్తుంది.
ఫామ్-16 అంటే ఏమిటి?
ఫారం-16 అనేది పర్సనల్ డాక్యుమెంట్. ప్రతి ఉద్యోగికి ఎవరి ఫామ్-16 వాళ్లకు అందుతుంది. ఇందులో, ఆ ఉద్యోగికి చెందిన కీలక సమాచారం, అంటే.. ఉద్యోగికి ఇచ్చిన జీతం (salary), ఉద్యోగి క్లెయిమ్ చేసిన తగ్గింపులు (Deductions), కంపెనీ యాజమాన్యం కట్ చేసిన TDS (Tax Deducted At Source) సమాచారం ఇందులో ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 203 ప్రకారం, కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 ఇవ్వడం తప్పనిసరి.
ఫామ్-16 పొందిన తర్వాత, ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి తాత్సారం చేయకూడదు. 2024 ఏప్రిల్ 01 నుంచి ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయవచ్చు. ITR దాఖలుకు జులై 31 వరకు గడువు (ITR Filing Deadline 2024) ఉంటుంది. చివరి రోజుల్లో పోర్టల్‌లో రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తడం గతంలో చాలాసార్లు కనిపించింది. కాబట్టి, తుది గడువు వచ్చే వరకు వేచి ఉండటం సరికాదు. 2024 జులై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఆలస్య రుసుము కట్టాలి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
జీతభత్యాల వివరాలను తనిఖీ చేయండి
ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే ముందు, ఫామ్-16ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మీ జీతభత్యాలు మీ ఫామ్-16లో సరిగ్గా చూపారో, లేదో తనిఖీ చేయండి. ఆ వివరాల్లో... హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) ముఖ్యమైనవి. ITR నింపే ముందు ఈ 5 విషయాలను కూడా తనిఖీ చేయడం అవసరం.
ఈ 5 విషయాలను క్షుణ్నంగా పరిశీలించండి
- మీ పాన్ నంబర్ సరిగా ఉందో, లేదో చెక్ చేసుకోండి. అందులో ఒక్క డిజిట్ తప్పుగా ఉన్నా TDS క్లెయిమ్ చేయలేరు.
- ఫారం-16లో మీ పేరు, చిరునామా, కంపెనీ TAN నంబర్‌ను తనిఖీ చేయండి.
- ఫామ్-16లో కనిపించే పన్ను మినహాయింపు వివరాలన్నీ ఫామ్-26AS & AISతో సరిపోవాలి.
- మీరు పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకున్నట్లయితే, పన్ను ఆదా చేసే డిడక్షన్స్ వివరాలను తనిఖీ చేయండి.
- 2023-24లో మీరు ఉద్యోగం/ఉద్యోగాలు మారినట్లయితే, పాత కంపెనీ నుంచి కూడా ఫామ్-16ని ఖచ్చితంగా తీసుకోండి.
మరో ఆసక్తికర కథనం: 80Cని మించి పన్ను ఆదా చేసే సెక్షన్లు - మీ ఇన్‌కమ్‌ను రూ.లక్షల్లో తగ్గించి చూపిస్తాయ్!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్