- పేటీఎం లిస్టింగ్ తర్వాత సోషల్ మీడియాలో పేలుతున్న జోకులివీ!
దశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవో. రూ.18,500 కోట్ల విలువైన ఇష్యూ. డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే నంబర్‌వన్ కంపెనీ. చాలారోజులుగా ఎంతోమంది ఆసక్తితో ఎదురు చూసిన ఈ ఐపీవో చివరికి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది! ఒక్కరోజే 27 శాతం షేరు ధర నష్టపోవడంతో మదుపర్లు దాదాపుగా కంటతడి పెట్టుకున్నారు.
పేటీఎం ఒక్కో షేరు ధరను రూ.1250గా నిర్ణయించింది. గ్రే మార్కెట్లో ప్రీమియం పడిపోవడంతో ఐపీవో రోజు ఇన్వెస్టర్లు కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యారు. వారు ఊహించినట్టుగానే గురువారం 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1950 వద్ద షేరు నమోదైంది. అటు మార్కెట్లు పతనం అవుతుండటం, నెగెటివ్ సెంటిమెంటు ఉండటం, మదుపర్లు విక్రయాలకు దిగడంతో పేటీఎం షేరు ధర అమాంతం పడిపోవడం మొదలైంది. వందో, రెండొందలో కాదు.. ఏకంగా రూ.500కు పైగా పతనమైంది. చివరికి 1564 వద్ద ముగిసింది. దాదాపుగా మార్కెట్లో ఐపీవోల్లో ఇదే అతిపెద్ద క్రాష్! ఇన్వెస్టర్లు రూ.1000 కోట్లకు పైగా షేర్లను అమ్మేశారు.
ఈ భారీ పతనంలో చిన్న మదుపరి కుంగిపోయాడు! తొలిరోజు అందరూ నష్టాలనే చవిచూశారు. రూ.8235 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసిన యాంకర్ ఇన్వెస్టర్లు అందరికన్నా ఎక్కువగా రూ.2,444 కోట్లు నష్టపోయారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (QIIs) రూ.7,375 కోట్లలో రూ.2,010 కోట్లు, రూ.2,081 కోట్లు పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు రూ.567 కోట్లు, హై నెట్‌వర్త్ ఇండివిజ్యువల్స్ రూ.608 కోట్లకు రూ.166 కోట్లు నష్టపోయారు. అంటే రిటైల్, హెచ్‌ఎన్‌ఐలు తొలిరోజు రూ.733 కోట్ల వరకు తమ డబ్బును కోల్పోయారు.
మదుపర్లు ఇంతగా నష్టపోతే పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ మాత్రం ఇన్వెస్టర్లకు తమ బిజినెస్ మోడల్ అర్థం కాలేదని అంటున్నారు!
Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్.. పేటీఎం ఫౌండర్ విజయ గాథ ఇది!
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది
Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి