By: ABP Desam | Updated at : 24 May 2023 10:57 AM (IST)
లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఏ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్?
Mutual Fund Investment: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడంపై ప్రజల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. దీర్ఘకాలానికి సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడానికి కొద్దిగా సమయం వెచ్చించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. మీరు, 2021లో SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా ICICI మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌లో (MF) సుమారు రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మార్కెట్ పరిస్థితులు బాగోలేక గత ఒకటిన్నర సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్ పేలవంగా పని చేశాయి. దీంతో, ఇప్పుడు మీ MF పెట్టుబడి విలువ రూ. 1.1 లక్షలకు తగ్గి ఉండవచ్చు. ఇలాంటి కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఇలా ఎందుకు జరిగింది, పెట్టుబడి పెట్టడానికి ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సరైనది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఏడాదిన్నర కాలంగా మార్కెట్‌లో ఒడిదొడుకులు
2021 అక్టోబర్ నుంచి స్టాక్ మార్కెట్ ఒకే పరిధిలో (రేంజ్ బౌండ్) కదులుతోంది. ఆ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 61,000కు చేరువైంది. ఆ తర్వాత తగ్గింది, మళ్లీ 61,000కు వెళ్లింది. ప్రస్తుతం 62,000కు అటు, ఇటుగా మూవ్ అవుతోంది. ఈ ఏడాదిన్నర కాలంలో మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. దీనివల్ల, మ్యూచువల్ ఫండ్ రాబడి ఆశించిన దాని కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
కొంతమంది పెట్టుబడిదార్లు ఈ విషయాలను గ్రహిస్తారు. మార్కెట్ ఒడిదొడుకులను అర్ధం చేసుకుంటూ పెట్టుబడులు పెడతారు. మరికొంతమంది పెట్టుబడిదార్లు మ్యూచువల్ ఫండ్/అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) పేరు, బ్రాండ్ చూసి పెట్టుబడి పెడతారు. ప్రతి AMC విభిన్నమైన ఫండ్స్‌ను నిర్వహిస్తుంటుంది, ఈ ఫండ్స్‌కు దేని లక్ష్యం దానికి ఉంటుంది. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లుగా AMC లేదా ఫండ్ మేనేజర్ ఎంత సమర్థవంతంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నదానిపై మ్యూచువల్ ఫండ్ పని తీరు ఆధారపడి ఉంటుంది. కాబట్టి, పేలవమైన పని తీరు రిస్క్‌ను తగ్గించడానికి & ఒకే ఫండ్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండటానికి మీ పెట్టుబడుల్లో వైవిధ్యం తీసుకురావడం చాలా ముఖ్యం. అంటే, ఒకే ఫండ్ స్కీమ్‌లో కాకుండా వివిధ రకాల ఫండ్ స్కీమ్‌ల మధ్య మీ పెట్టుబడులను కేటాయించాలి. అంతేకాదు, మార్కెట్ పరిస్థితులను బట్టి, వివిధ ఫండ్‌ల మధ్య వివిధ మొత్తాలను కేటాయించాలి. అంతేగానీ, మీ పెట్టుబడిని అన్ని స్కీమ్‌లకు సమానంగా పంచకూడదు. క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (SIP) ద్వారా పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలానికి మంచి మార్గం.
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడిపై మంచి రాబడి పొందే అవకాశం ఉంది. ఇక్కడ, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది.
ఈ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు:
పరాగ్ పారిఖ్ ఫ్లెక్సిక్యాప్ ఫండ్
SBI లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్
HDFC ఫ్లెక్సీక్యాప్ ఫండ్
కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్
ఇది కూడా చదవండి: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' LIC, Nykaa, NMDC
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!