By: ABP Desam | Updated at : 23 Sep 2022 01:39 PM (IST)
Edited By: Arunmali
మార్కెట్ ఫోకస్లో టాటా గ్రూప్ షేర్లు
Tata Group Shares: మల్టీ నేషనల్ స్టీల్ కంపెనీ టాటా స్టీల్ (Tata Steel), తన అనుబంధ సంస్థలన్నింటినీ విలీనం చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇవాళ్టి (శుక్రవారం) ట్రేడ్‌లో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు మార్కెట్ ఫోకస్‌లోకి వచ్చాయి.
ఏడు కంపెనీలు - టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ (Tata Steel Long Products), టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా (Tinplate Company of India), టాటా మెటాలిక్స్ (Tata Metaliks), టీఆర్‌ఎఫ్ లిమిటెడ్ (TRF Limited), ఇండియన్ స్టీల్ & వైర్ ప్రొడక్ట్స్ (Indian Steel & Wire Products), టాటా స్టీల్ మైనింగ్ (Tata Steel Mining), ఎస్&టీ మైనింగ్ కంపెనీని (S&T Mining Company) టాటా స్టీల్‌లో (మాతృ సంస్థ) విలీనం చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
టాటా గ్రూప్ లిస్టెడ్ ప్లేయర్లలో ఒకటైన TRF, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 160 శాతం పెరిగింది, టాటా గ్రూప్‌లో అత్యధిక రిటర్న్స్ అందించిన కంపెనీగా నిలిచింది. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (Tata Investment Corporation) 88 శాతం, ఇండియన్ హోటల్స్ (Indian Hotels) 84 శాతం చొప్పున పెరిగాయి. టాటా ఎల్‌క్సీ (Tata Elxsi) 54 శాతం జంప్ చేయగా, ఇటీవల హిస్టారికల్ పీక్‌కు చేరిన టాటా కెమికల్స్ (Tata Chemicals) ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు 29 శాతం లాభపడింది.
టెక్నికల్ అనాలిసిస్ పరంగా, కొన్ని టాటా గ్రూప్ స్టాక్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని, వాటిని ట్రాక్ చేస్తున్న ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఇంకా ఎంత మేర వృద్ధి చెందే దమ్ము వాటిలో ఉందో వివరించారు.
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (TATAINVEST)
టార్గెట్ ప్రైస్: రూ.2,800, ఇది దాటితే రూ.3,000
వృద్ధి చెందే అవకాశం: ప్రస్తుతం 12%, అక్కడ్నుంచి 21%
ఇండియన్ హోటల్స్ కంపెనీ (INDHOTEL)
టార్గెట్ ప్రైస్: రూ.400
వృద్ధి చెందే అవకాశం: 20%
టాటా ఎల్‌క్సీ లిమిటెడ్ (TATAELXSI)
టార్గెట్ ప్రైస్: రూ.10,000
వృద్ధి చెందే అవకాశం: 12%
టాటా కెమికల్స్ లిమిటెడ్ (TATACHEM)
టార్గెట్ ప్రైస్: రూ.1,500
వృద్ధి చెందే అవకాశం: 25%
నెల్కో లిమిటెడ్ (NELCO)
ఔట్‌లుక్: రూ.1000 దగ్గర సెల్లింగ్ ప్రెజర్‌ను తట్టుకోగలగాలి. ఒత్తిడి తట్టుకుని రూ.1000 మార్క్‌ను విజవంతంగా దాటితే, రూ.1200 వరకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. రూ.890 దగ్గర తక్షణ సపోర్ట్ ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?