search
×

Stocks to watch 8 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి, IndiGoలో సెల్లింగ్‌ ఛాన్సెస్‌

మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో తనకున్న వాటాలో 2.8 శాతం స్టేక్‌ను బ్లాక్ డీల్స్ ద్వారా సుమారు రూ.2,000 కోట్లకు విక్రయించే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

Stocks to watch today, 8 September 2022: ఇవాళ ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 98.5 పాయింట్లు లేదా 0.56 శాతం గ్రీన్‌‌లో 17,729 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ అప్‌ ప్రారంభం ఉంటుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో): ఇండిగో ఎయిర్‌లైన్స్ కో-ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్, మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో తనకున్న వాటాలో 2.8 శాతం స్టేక్‌ను బ్లాక్ డీల్స్ ద్వారా సుమారు రూ.2,000 కోట్లకు విక్రయించే అవకాశం ఉంది.

డా.రెడ్డీస్ లేబొరేటరీస్: USFDA ఆమోదం రావడంతో, REVLIMID క్యాప్సూల్స్‌కు సమాన జెనరిక్ వెర్షన్ అయిన లెనాలిడోమైడ్ (Lenalidomide) క్యాప్సూల్స్‌ను అమెరికన్‌ మార్కెట్‌లోకి ఈ ఫార్మా మేజర్ విడుదల చేసింది. ఈ వాల్యూమ్ లిమిటెడ్‌ లాంచ్‌తో, ఫస్ట్-టు-మార్కెట్‌ అర్హత సాధించింది.

రిలయన్స్ (RIL): కొన్ని రోజుల క్రితం, దిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ లిమిటెడ్ నుంచి కాంపా కోలా బ్రాండ్‌ను రూ.22 కోట్లకు కొనుగోలు చేసి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచిన రిలయన్స్‌ రిటైల్ విభాగం, మరిన్ని కొనుగోళ్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఎస్‌బీఐ: భారతదేశపు అతి పెద్ద బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బుధవారం, 7.75 శాతం కటాఫ్‌తో రూ.6,872 కోట్ల విలువైన అదనపు టైర్-1 (AT1) బాండ్లను జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇతర బ్యాంకులు నిర్ణయించిన దాని కంటే ఇదే తక్కువ రేటు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: కల్వర్ మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో (గతంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్) విలీనాన్ని ఆమోదించడానికి, అక్టోబర్ 14న వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ముంబై బెంచ్ బుధవారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆదేశించింది.

కన్జ్యూమర్‌ స్టాక్స్‌: కొవిడ్ సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడిన ఈ కంపెనీలు, ప్రస్తుత పండుగ సీజన్‌లో బలమైన విక్రయాలను చూస్తున్నాయి. గణేష్ చతుర్థి, ఓనంతో మన దేశంలోని పండుగ సీజన్ ప్రారంభమైంది.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, నిర్మాణ సామగ్రి పరిశ్రమ కోసం JSW వన్ ప్లాట్‌ఫామ్స్‌ను (JSW One Platforms) అతి పెద్ద ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌గా నిర్మించాలని చూస్తోంది. FY32 నాటికి $20 బిలియన్ల స్థూల వాణిజ్య విలువ (GMV) దీని లక్ష్యం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌, తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను (MCLR) 10 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది, ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. గత రెండు నెలల్లో ఈ బ్యాంక్‌ తీసుకున్న రెండో దఫా వడ్డీ రేటు పెంపుదల ఇది. 

యాక్సిస్ బ్యాంక్: ప్రాధాన్యత రంగ రుణాలను మరింత పెంచేందుకు, బ్రాంచ్‌ లెస్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ PayNearbyతో ఈ బ్యాంక్‌ ఒప్పందం చేసుకుంది.

ఇవాళ F&O నిషేధంలో ఉన్న స్టాక్స్‌: డెల్టా కార్ప్

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 08 Sep 2022 09:04 AM (IST) Tags: Share Market Stocks to watch Stock Market

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?

Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?

మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం