By: ABP Desam | Updated at : 02 Sep 2022 08:53 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ టుడే
Stocks to watch today: ఇవాళ ఉదయం 7.30 గం. సమయానికి సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఆ సమయంలో 51 పాయింట్లు లేదా 0.29 శాతం గ్రీన్‌లో 17,619.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ సానుకూలంగా ప్రారంభమవుతుందని ఇది సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇన్ఫోసిస్: యూరప్‌కు చెందిన లైఫ్ సైన్సెస్ కన్సల్టింగ్, టెక్నాలజీ సంస్థ బేస్ (BASE) లైఫ్ సైన్స్ కొనుగోలును ఈ ఐటీ సంస్థ పూర్తి చేసింది. దీంతో నార్డిక్స్ ప్రాంతంలో ఇన్ఫోసిస్ ఉనికి మరింత పెరుగుతుంది.
హీరో మోటోకార్ప్: గత నెల మొత్తం అమ్మకాలలో 1.92 శాతం వృద్ధిని నమోదు చేసింది, 4,62,608 యూనిట్లను అమ్మింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ కంపెనీ 4,53,879 యూనిట్లను విక్రయించింది.
యూపీఎల్: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) మైక్ ఫ్రాంక్‌ను కంపెనీ నియమించింది. ఫ్రాంక్, యూపీఎల్ క్రాప్ ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో కూడా ఒక సభ్యుడు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఈ నెల 30 నుంచి నిఫ్టీ50లో చోటు సంపాదిస్తుంది. శ్రీ సిమెంట్ స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిఫ్టీ50 ఇండెక్స్‌లోకి అడుగు పెడుతుంది.
ఐషర్ మోటార్స్: ఆగస్టులో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలు 53 శాతం పెరిగి 70,112 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ కంపెనీ 45,860 యూనిట్లను విక్రయించింది.
అరబిందో ఫార్మా: అరబిందో ఫార్మా పూర్తి స్థాయి అనుబంధ విభాగమైన క్యూరాటెక్ (CuraTeQ) బయోలాజిక్స్, బయోలాజిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సామర్థ్యం పెంపు కోసం సుమారు రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తోంది.
భారత్ ఎలక్ట్రానిక్స్: ఈ నవరత్న డిఫెన్స్ పీఎస్‌యూ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా (CMD), డైరెక్టర్ (ఫైనాన్స్) & సీఎఫ్‌వో దినేష్ కుమార్ బాత్రా అదనపు బాధ్యతలు స్వీకరించారు. బీఈఎల్‌ని (BEL) అత్యధిక టర్నోవర్‌ను సాధించడంలో డైరెక్టర్ (ఫైనాన్స్) & సీఎఫ్‌వోగా ఆయన కీలక పాత్ర పోషించారు.
కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్: ఎన్‌ఎస్‌ఈలోని బల్క్ డీల్ డేటా ప్రకారం.. జనరల్ అట్లాంటిక్ సింగపూర్ సంస్థ ఈ హాస్పిటల్‌కు చెందిన 16.60 లక్షల షేర్లను సగటున రూ.1,230 చొప్పున ఓపెన్ మార్కెట్‌లో అమ్మేసింది. డీల్ విలువ రూ. 204.18 కోట్లు. ఎమరాల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ అదే ధర వద్ద 15,70,000 షేర్లను కైవసం చేసుకుంది.
ఇండియన్ బ్యాంక్: ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు, శనివారం నుంచి ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును (MCLR లేదా వడ్డీ రేటు) 0.10 శాతం పెంచి 7.75 శాతానికి మారుస్తోంది. ట్రెజరీ బిల్లులపైనా రుణ రేట్లను సవరించింది.
జీఎంఆర్ పవర్ & అర్బన్ ఇన్‌ఫ్రా: సెక్యూరిటీలను జారీ చేసి రూ.3,000 కోట్ల వరకు సమీకరించేందుకు కంపెనీ బోర్డు అనుమతి ఇచ్చింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.
రామ్‌కో సిస్టమ్స్: ఈ కంపెనీకి చెందిన అమెరికన్ అనుబంధ సంస్థ అయిన 'రామ్‌కో సిస్టమ్స్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్‌కార్పొరేటెడ్', జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ నుంచి ఒక కాంట్రాక్టు దక్కించుకుంది. దీని విలువ ఎంతో ఇంకా వెల్లడించలేదు.
జీఎండీసీ: గుజరాత్‌లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంలో ఆర్థిక సాధ్యాసాధ్యాల గురించి అధ్యయనం చేయాలని ఆలోచిస్తున్నట్లు ఈ ప్రభుత్వ రంగ సంస్థ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పర్మనెంట్ మాగ్నెట్స్, విండ్ టర్బైన్స్, ఎల్‌ఈడీలు వంటి గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి రేర్ ఎర్త్ మెటల్స్ లేదా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా కీలకం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
Peelings Song : "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?