By: ABP Desam | Updated at : 04 Oct 2022 11:38 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Getty )
Stock Market Opening 04 September 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు ఎగిసిన ఉత్సాహంలో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 325 పాయింట్ల లాభంతో 17,213 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1060 పాయింట్ల లాభంతో 57,856 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 56,788 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,506 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 57,506 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,035 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 1060 పాయింట్ల లాభంతో 57,856 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 16,887 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,147 వద్ద ఓపెనైంది. 17,117 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,257 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 325 పాయింట్ల లాభంతో 17,213 వద్ద నడుస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 38,700 వద్ద మొదలైంది. 38,596 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,113 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 937 పాయింట్ల లాభాల్లో 38,967 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 48 కంపెనీలు లాభాల్లో 2 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్, హీరోమోటో కార్ప్, హిందాల్కో, ఐచర్ మోటార్స్ లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్ సూచీలు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత