search
×

Stock Market News: 500+ నుంచి -48కి సెన్సెక్స్‌! ఆరంభ లాభాలన్నీ ఆఖర్లో హాంఫట్‌!

Stock Market Closing Bell on 3 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,584, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 48 పాయింట్ల నష్టంతో 56,769 వద్ద ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell on 3 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు గ్యాప్‌ అప్‌తో మొదలవ్వడం ఉదయం మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. సెనెక్స్‌ 500, నిఫ్టీ 111 పాయింట్ల మేర ఎగిశాయి. ఐరోపా మార్కెట్లు తెచుకున్నాక అమ్మకాల ప్రెజర్‌ ఎక్కువైంది. చివరికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,584, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 48 పాయింట్ల నష్టంతో 56,769 వద్ద ముగిశాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 55,818 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,245 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 55,719 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,432 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 48 పాయింట్ల నష్టంతో 55,769 వద్ద ముగిసింది. ఉదయం 500 పాయింట్లు లాభపడ్డ సూచీ ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక ఒక్కసారిగా పతనమైంది.

NSE Nifty

గురువారం 16,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,761 వద్ద ఓపెనైంది. 16,567 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,793 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 43 పాయింట్ల నష్టంతో 16,584 వద్ద క్లోజైంది. ఉదయం నిఫ్టీ 111 పాయింట్ల మేర లాభపడటం గమనార్హం.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,929 వద్ద మొదలైంది. 35,175 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,958 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 123 పాయింట్లు లాభపడ్డ సూచీ ఆఖరికి 338 పాయింట్ల నష్టంతో 35,275 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్‌, ఇన్ఫీ, ఎల్‌టీ, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, శ్రీసెమ్‌, హీరో మోటోకార్ప్‌, మారుతీ నష్టపోయాయి. ఐటీ మినహాయిస్తే మిగతా రంగాల సూచీలపై సెల్లింగ్‌ ప్రెజర్‌ కనిపించింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 03 Jun 2022 03:55 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

టాప్ స్టోరీస్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !

YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!

YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!

TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?

TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?