search
×

Stock Market Closing: తేరుకున్న సూచీలు! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing 07 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. ఉదయం భారీగా పతనమైన సూచీలు చివరికి తేరుకున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 07 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. రూపాయి మరోసారి ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరడంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఉదయం భారీగా పతనమైన సూచీలు చివరికి తేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17 పాయింట్ల నష్టంతో 17,314 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 30 పాయింట్ల నష్టంతో 58,191 వద్ద ముగిశాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 58,222 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,092 వద్ద నష్టాల్లో మొదలైంది. 57,851 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,269 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 30 పాయింట్ల నష్టంతో 58,191 వద్ద ముగిసింది.

NSE Nifty

గురువారం 17,331 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,287 వద్ద ఓపెనైంది. 17,216 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,337 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.  మొత్తంగా 17 పాయింట్ల నష్టంతో 17,314 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,093 వద్ద మొదలైంది. 38,807 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,235 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 104 పాయింట్ల నష్టంతో 39,178 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ముగిశాయి. టైటాన్‌, పవర్‌ గ్రిడ్‌, గ్రాసిమ్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా కన్జూమర్‌, బీపీసీఎల్‌, ఎం అండ్‌ ఎం, అల్ట్రాసెమ్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. మీడియా, రియాల్టీ, కన్జూమర్‌ డురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 07 Oct 2022 04:28 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!

AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!

Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!

Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి

Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి

Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు