By: ABP Desam | Updated at : 27 May 2022 05:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening Bell on 27 May 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆరంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. బంగారం ధర స్థిరపడటం, అమెరికన్లు డాలర్‌ను పక్కన పెట్టి స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుండటం, ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఓపెనవ్వడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటు నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,276 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 382 పాయింట్లు లాభపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,252 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,671 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. ఆరంభం నుంచే కొనుగోళ్ల ఊపు కనిపించింది. 54,518 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,791 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 382 పాయింట్ల లాభంతో 54,630 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 16,170 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,296 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల్లో ఉంది. 16,253 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,239 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 103 పాయింట్ల లాభంతో 16,276 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మాత్రం భారీ లాభాల్లో ఉంది. ఉదయం 35,326 వద్ద మొదలైంది. 35,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,536 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 388 పాయింట్ల లాభంతో 35,483 వద్ద ఉంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్, ఆసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్‌ను మినహాయిస్తే అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి.
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్