By: Rama Krishna Paladi | Updated at : 21 Aug 2023 12:54 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market @12 PM, 21 August 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ఉన్నాయి. ఆరంభం నుంచే ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినప్పటికీ వారు విశ్వాసంగా ఉన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్లు పెరిగి 19,392 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 270 పాయింట్లు పెరిగి 65,218 వద్ద కొనసాగుతున్నాయి. నేడు ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగ సూచీల్లో స్ట్రెంత్ కనిపిస్తోంది. అదానీ గ్రూప్ షేర్లు పెరిగాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 64,948 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 64,852 వద్ద మొదలైంది. 64,852 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,218 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 270 పాయింట్ల లాభంతో 65,218 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,310 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,320 వద్ద ఓపెనైంది. 19,296 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,393 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 82 పాయింట్లు పెరిగి 19,392 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,952 వద్ద మొదలైంది. 43,862 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,066 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 199 పాయింట్లు పెరిగి 44,050 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 45 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, పవర్ గ్రిడ్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్, రిలయన్స్, ఎం అండ్ ఎం, ఎల్‌టీ, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.59,070 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.73,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.24,390 వద్ద ఉంది.
Also Read: తుస్సుమన్న జియో ఫైనాన్షియల్ షేర్లు, లిస్టింగ్ తర్వాత లోయర్ సర్క్యూట్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy