By: ABP Desam | Updated at : 08 Jun 2022 03:51 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing Bell on 8 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ ద్వైమాసిక సమీక్షలో రెపోరేట్ పెంచడంతో మదుపర్లు ఆచితూచి స్పందించారు. మధ్యాహ్నం లాభాల్లోకి వచ్చిన సూచీ ఐరోపా మార్కెట్లు తెరిచాక మళ్లీ నేల చూపులు చూశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 60 పాయింట్ల నష్టంతో 16,356, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 214 పాయింట్ల నష్టంతో 54,892 వద్ద క్లోజ్ అయ్యాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 55,107 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,345 వద్ద లాభాల్లో మొదలైంది. 54,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,423 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 214 పాయింట్ల నష్టంతో 54,892 వద్ద ముగిసింది. ఆరంభం నుంచే సూచీపై ఒత్తిడి కనిపించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్ పెంచడంతో మదుపర్లు కాసేపు కొనుగోళ్లు చేపట్టడంతో సెన్సెక్స్ లాభాల్లోకి వచ్చింది. మళ్లీ ఆఖర్లో నష్టాల్లోకి జారుకుంది.
NSE Nifty
మంగళవారం 16,416 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,474 వద్ద ఓపెనైంది. 16,293 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,514 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 60 పాయింట్ల నష్టంతో 16,356 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,165 వద్ద మొదలైంది. 34,831 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,499 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 49 పాయింట్ల నష్టంతో 34,946 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీలు, ఎస్‌బీఐ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, రిలయన్స్, యూపీఎల్, ఏసియన్ పెయింట్స్ నష్టాల్లో ముగిశాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలన్నీ పతనం అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు నష్టపోయాయి. రియాల్టీ, హెల్త్‌కేర్, ఫార్మా, మెటల్, మీడియా, ఐటీ, ఆటో సూచీలు లాభపడ్డాయి.
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
KTR Wishes KCR: నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
Vicky Kaushal: 'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్ స్టార్ విక్కీ కౌశల్!
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
US Deportation: అమెరికాలోని భారతీయులకు బ్రహ్మాస్త్రం- ట్రంప్‌తో మాట్లాడా, అంతా సెట్ అవుతుందన్న కేఏ పాల్