By: ABP Desam | Updated at : 25 Oct 2022 04:03 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Twitter )
Stock Market Closing 25 October 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందలేదు. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 74 పాయింట్ల నష్టంతో 17,656 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 287 పాయింట్ల నష్టంతో 59,543 వద్ద ముగిశాయి. శుక్రవారంతో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 82.73 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,831 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,002 వద్ద లాభాల్లో మొదలైంది. 59,489 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,081 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 287 పాయింట్ల నష్టంతో 59,543 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,730 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,808 వద్ద ఓపెనైంది. 17,637 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 74 పాయింట్ల నష్టంతో 17,656 వద్ద స్థిరపడింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 41,513 వద్ద మొదలైంది. 41,021 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,530 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 182 పాయింట్ల నష్టంతో 41,122 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, ఎల్‌టీ, ఐచర్ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, హిందుస్థాన్ యునీలివర్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోయాయి. ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి
Telangana Rising Summit: PPP మోడల్ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy