search
×

Stock Market Closing: ఇన్వెస్టర్ల కాసుల పంట! సెన్సెక్స్‌ 1270, నిఫ్టీ 380 పాయింట్లు అప్‌!

Stock Market Closing 04 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు పెరిగి 81.52 వద్ద స్థిరపడింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 04 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 386 పాయింట్ల లాభంతో 17,274 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1276 పాయింట్ల లాభంతో 58,065 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు పెరిగి 81.52 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 56,788 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,506 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 57,506 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,099 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1276 పాయింట్ల లాభంతో 58,065 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 16,887 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,147 వద్ద ఓపెనైంది. 17,117 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,287 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 386 పాయింట్ల లాభంతో 17,274 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో క్లోజైంది. ఉదయం 38,700 వద్ద మొదలైంది. 38,596 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,177 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1080 పాయింట్ల లాభంతో 39,110 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 48 కంపెనీలు లాభాల్లో 2 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, డాక్టర్ రెడ్డీస్‌ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కళకళలాడాయి. మెటల్‌, ప్రైవేట్ బ్యాంకు సూచీలు 3 శాతానికి పైగా ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మీడియా, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 2 శాతాన్ని మించి లాభపడ్డాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 04 Oct 2022 03:47 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Best MFs: మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇది రివార్డింగ్‌ టైమ్‌, ఈ నెలలో ఇన్వెస్ట్‌ చేయగల బెస్ట్‌ ఫండ్స్ ఇవి

Best MFs: మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇది రివార్డింగ్‌ టైమ్‌, ఈ నెలలో ఇన్వెస్ట్‌ చేయగల బెస్ట్‌ ఫండ్స్ ఇవి

Best Equity Funds: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్‌ ఈక్విటీ ఫండ్స్‌ - వీటి ట్రాక్ రికార్డ్‌ కేక

Best Equity Funds: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్‌ ఈక్విటీ ఫండ్స్‌ - వీటి ట్రాక్ రికార్డ్‌ కేక

ETFs: ఈటీఎఫ్‌ అంటే ఏంటి - ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్‌?

ETFs: ఈటీఎఫ్‌ అంటే ఏంటి - ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్‌?

Debt Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

Debt Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

టాప్ స్టోరీస్

Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్

Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్

Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు

Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు

Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?

Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?

Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే

Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే