By: Rama Krishna Paladi | Updated at : 04 Jul 2023 12:44 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market @12 PM, 4 July 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైనా క్రమంగా కొనుగోళ్లు పెరిగాయి. మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 63 పాయింట్లు పెరిగి 19,385 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 299 పాయింట్లు పెరిగి 65,504 వద్ద కొనసాగుతున్నాయి. బజాజ్ ట్విన్స్, టైటాన్, ఎస్బీఐ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,205 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,503 వద్ద మొదలైంది. 65,171 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,586 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 299 పాయింట్ల లాభంతో 65,504 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,322 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,406 వద్ద ఓపెనైంది. 19,300 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,413 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 63 పాయింట్ల లాభంతో 19,385 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,310 వద్ద మొదలైంది. 45,000 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,469 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 295 పాయింట్లు పెరిగి 45,453 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరోమోటో కార్ప్, టైటాన్, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, గ్రాసిమ్, ఓఎన్‌జీసీ, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,060గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.71,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.24,020 వద్ద ఉంది.
Also Read: సెన్సెక్స్, నిఫ్టీతో బజాజ్ ఫైనాన్స్ పోటీ - రేస్ రసవత్తరం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
As a smart investor, only deal with registered SEBI stockbrokers! Know more: https://t.co/6EIJrMfLod#NSEIndia #SochKarSamajhKarInvestKar #InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #InvestorProtection @ashishchauhan
— NSE India (@NSEIndia) July 4, 2023
Full-scale operations of NSE IX -SGX Connect commenced today with $8.05bn open interest in Nifty future and over $1.04bn open interest in Nifty Options .
— NSE IX (@nse_ix) July 3, 2023
The first session hit a new milestone with traded volume of US$1.13billion.@NSEIXGiftNifty @AshishChauhan @balav1971… pic.twitter.com/yP2cc7V745
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి