search
×

Stock Market Today: హమ్మయ్య! 4 రోజుల నష్టాలకు చెక్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ అప్‌!

Stock Market Closing 25 September 2023: నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 25 September 2023:

నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆఖర్లో సెంటిమెంటు బలపడటంతో లాభాల బాట పట్టాయి.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) అర పాయింటు పెరిగి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 14 పాయింట్లు ఎగిసి 66,023 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లు మాత్రం ఎరుపెక్కాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,009 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,082 వద్ద మొదలైంది. 65,764 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,225 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 14 పాయింట్లు పెరిగి 66,023 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 19,674 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,678 వద్ద ఓపెనైంది. 19,601 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,734 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. అర పాయింటు పెరిగి 19,674 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 44,615 వద్ద మొదలైంది. 44,400 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,936 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 154 పాయింట్ల లాభంతో 44,766 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా కన్జూమర్‌, అపోలో హాస్పిటల్స్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, ఎస్బీఐ లైఫ్‌, ఇన్ఫీ, హీరోమోటో, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టపోయాయి. ఫైనాన్స్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.75,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.24,560 వద్ద ఉంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

భారత స్టాక్‌ మార్కెట్లు వరుస నాలుగో రోజు నష్టపోయాయి. రోజు మొత్తం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో రీబౌండ్‌ అయ్యాయి. ఐరోపా స్టాక్స్‌ పడిపోవడం, యూఎస్‌ వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 68 పాయింట్లు తగ్గి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.94 వద్ద స్థిరపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 25 Sep 2023 04:06 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

టాప్ స్టోరీస్

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !

Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !

PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు

PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు